Begin typing your search above and press return to search.
ధరణిపై స్టే పొడిగింపు
By: Tupaki Desk | 22 Jan 2021 1:52 PM GMTతెలంగాణలో భూవివాదాలకు తావులేకుండా కేసీఆర్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘ధరణి’ పోర్టల్ పై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. రిజిస్ట్రేషన్లపై ఉన్న స్టేను హైకోర్టు పొడిగించింది. వ్యవసాయేతర ఆస్తుల నమోదు, రిజిస్ట్రేషన్లపై గతంలో ఇచ్చిన స్టేను జూన్ 21కి హైకోర్టు పొడిగించింది.
ధరణి పోర్టల్ కు సంబంధించి దాఖలైన ప్రజాప్రయోజనాల వ్యాజ్యంపై హైకోర్టు ధర్నాసనం ఇవాళ విచారణ చేపట్టింది. ఒకే అంశంపై పలు పిటీషన్లు దాఖలు కావడంతో అందులో ఐదు పిటీషన్లు తోసిపుచ్చి మిగతా రెండింటిని విచారణకు స్వీకరించింది.
ఒకే అంశంపై అనేక పిటీషన్లు అవసరం లేదన్న హైకోర్టు, ధరణిపై రెండు పిల్స్ పై మాత్రమే విచారణ జరుపుతామని స్పష్టం చేసింది.
ధరణిపై అభ్యంతరాలను మంత్రివర్గ ఉపసంఘం పరిశీలిస్తోందని.. ప్రభుత్వ వైఖరి తెలిపేందుకు సమయం కావాలని ఏజీ కోర్టును కోరారు.
ఏజీ విజ్ఞప్తిపై స్పందించిన ధర్మాసనం గతంలో ఇచ్చిన స్టేను జూన్ 21 వరకు పొడగిస్తూ కేసు విచారణను వాయిదా వేసింది.