Begin typing your search above and press return to search.
స్టే రాలేదు.. స్టేటస్ కో ఇవ్వలేదు.. కేసీఆర్ సర్కారుకు సుప్రీం నో!
By: Tupaki Desk | 8 Feb 2023 6:27 PM GMTఏ ముహుర్తంలో మొదలు పెట్టారో కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు 'ఎమ్మెల్యేల ఎర కేసు' తెగ ఇబ్బంది పెడుతోంది. ఆయన కోరుకున్నదేదీ జరగటం లేదు. ఆయన అనుకున్న దానికి పూర్తి వ్యతిరేక పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. ఎమ్మెల్యేల ఎర కేసుతో బీజేపీ అధినాయకత్వానికి ముచ్చమటలు పోయించొచ్చన్న భావనలో కేసీఆర్ సర్కారు మొదట్లో భావించినా.. ఆయన దూకుడుతనం లేనిపోని తలనొప్పుల్ని తెచ్చి పెట్టటమే కాదు.. చివరకు ఇప్పుడు ఆ కేసులో ఆయన ఇబ్బందులు పడే పరిస్థితికి వచ్చింది.
ఎమ్మెల్యేల ఎర కేసును సీఐడీకి అప్పజెప్పటం.. దానికి కాదు సీబీఐకి ఇవ్వాలని హైకోర్టు సింగిల్ బెంచ్ చెప్పటం.. దాని మీద హైకోర్టు ధర్మాసనాన్ని ఆశ్రయించటం.. అక్కడా ఎదురుదెబ్బ తగలటం.. సమయం కోసం అడిగి.. అందుకు నో చెప్పిన వేళ.. మళ్లీ రివ్యూ పిటీషన్ ను తెలంగాణ హైకోర్టులో వేసినట్లే వేసి.. అనూహ్యంగా సుప్రీం ముందుకు వెళ్లిన వైనం తెలిసిందే. హైకోర్టు ధర్మాసనం ఆదేశాల నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించిన ఫైళ్లను తమకు ఇవ్వాల్సిందిగా సీబీఐ అడుగుతున్న నేపథ్యంలో.. కేసీఆర్ సర్కారు ఉక్కిరిబిక్కిరి అవుతోంది.
సీబీఐకి ఫైళ్లు ఇస్తే పిటిషన్ నీరు కారిపోతుందన్న వాదనను తెలంగాణ సర్కారు వినిపిస్తోంది. తాజాగా సుప్రీంకోర్టులో దీనికి సంబంధించిన విచారణ జరిగింది. సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం వద్ద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదిస్తూ.. ఎమ్మెల్యేల ఎర కేసుకు సంబంధించిన ఫైళ్లను సీబీఐ ఇవ్వాలని కోరుతుందని.. ఒకసారి ఫైళ్లు సీబీఐకి వెళితే కేసు స్వరూపం మారుతుందని.. అందుకే తెలంగాణ హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన ఆదేశాల మీద స్టే ఇవ్వాలని లేదంటే స్టేటస్ కో అయినా ఇవ్వాలని పేర్కొన్నారు.
దీనికి స్పందించిన సీజేఐ స్టే.. స్టేటస్ కో ఇచ్చేందుకు నో చెప్పారు. కాకుంటే.. ఈ కేసుపై విచారణను ఈ నెల 17న చేపడతామని.. ఆ రోజే అన్ని అంశాల్ని పరిశీలిస్తామని పేర్కొన్నారు. ఒకవేళ కేసులో మెరిట్స్ ఉంటే ఇచ్చిన డాక్యుమెంట్లను వెనక్కి ఇవ్వాలని సీబీఐను ఆదేశిస్తామని పేర్కొన్నారు. అయితే.. కేసు తీవ్రత నేపథ్యంలో ఈ నెల 17 కంటే ముందు విచారణ చేసేందుకు ఉన్న అవకాశాల్ని పరిశీలించాల్సిందిగా న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కోరారు. అయితే.. ఇందుకు సీజేఐ స్పందిస్తూ.. ఈ నెల 17నే విచారణ చేపడతామని ధర్మాసనం స్పష్టం చేసింది.
ఒకవైపు సుప్రీంలో ఇలా జరుగుతున్న వేళలోనే.. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ధర్మాసనంలోనూ ఇంతకు ముందు ఇచ్చిన తీర్పును ఆపాలన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనను హైకోర్టు చీఫ్ జస్టిస్ నోచెప్పారు. దీంతో.. సీబీఐ కోరినట్లుగా ఎమ్మెల్యేల ఎర కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లను సమర్పించాల్సి ఉంటుంది.
సుప్రీంలో విచారణకు మరో తొమ్మిది రోజులు ఉండటంతో.. రాష్ట్ర ప్రభుత్వానికి ఈ కేసుకు సంబంధించిన ఫైళ్లను ఇవ్వకతప్పని పరిస్థితి. మరి.. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఫైళ్లను సీబీఐ చేతికి ఇవ్వకుండా ఉండేందుకు కేసీఆర్ సర్కారు ఏం చేస్తారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.