Begin typing your search above and press return to search.
రామతీర్థం కొండ దిగిన విగ్రహాలు!
By: Tupaki Desk | 19 Jan 2021 5:06 PM GMTగత నెల చివర్లో ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాలో రామతీర్థం కొండపై ఉన్న శ్రీరాముడి విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేయడం ఎంతగా సంచలనం రేపిందో తెలిసిన సంగతే. రాజకీయంగా కూడా ఈ ఉదంతం ప్రకంపనలు రేపింది. జగన్ సర్కారు ఆత్మరక్షణలో పడేలా చేసింది. ఐతే ఈ వివాదం కొంత సద్దుమణిగాక ఏపీ సర్కారు దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టింది. అక్కడి విగ్రహాల స్థానంలో కొత్త వాటిని ప్రతిష్ఠించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో వేద పండితుల ఆధ్వర్యంలో ప్రాయశ్చిత్త హోమాలు నిర్వహించిన ప్రభుత్వం.. పటిష్ఠమైన పోలీసు బందోబస్తు మధ్య, సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రుని విగ్రహాలతో పాటు, హనుమంతుని విగ్రహాన్ని కొండపై ఉన్న ఆలయం నుంచి తొలగించి.. కొండ కింద ఉన్న ప్రధానాలయంలోకి తరలించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆగమ పండితులతో పాటు రామతీర్థం ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో ప్రాయశ్చిత్త హోమం జరిగింది.
అనంతరం గోమాత తోకలు కట్టిన తాడుతో విగ్రహాలను వాటి స్థానాల నుంచి కదిలించారు.ఆపై అధికారుల పర్యవేక్షణలో విగ్రహాలను కొండ కిందకి చేర్చారు. పటిష్ఠ బందోబస్తు మధ్య సాగిన ఈ కార్యక్రమానికి భక్తులెవరినీ ఆలయ ప్రాంగణంలోకి, కొండ మీదికి అనుమతించలేదు. ఆలయంలో పునఃప్రతిష్ఠించనున్న కొత్త విగ్రహాలను టీటీడీనే ప్రత్యేకంగా తయారు చేయిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 23 నాటికి విగ్రహాల తయారీ పూర్తమవుతుందని.. తర్వాత ఓ మంచి ముహూర్తం చూసి విగ్రహాల ప్రతిష్ఠ జరుగుతుందని అధికారులు వెల్లడించారు. ఇటీవలి ఉదంతానికి తోడు.. కొండపై ఉన్న పురాతన ఆలయాన్ని నవీకరించి.. పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేయడం కోసమే విగ్రహాలను కిందికి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఆలయ అభివృద్ధి పనుల నిమిత్తం రూ. 3 కోట్లు కేటాయిస్తున్నట్లు ఇప్పటికే ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ప్రకటించారు. మెట్ల మార్గాన్ని కొత్తంగా నిర్మించడంతో పాటు, విద్యుత్ దీపాలు, భక్తులకు తాగు నీటి వసతి, స్వచ్ఛమైన కోనేరు, కొండపైకి శాశ్వత నీటి సరఫరా, కొండ చుట్టూ గ్రిల్స్, ప్రాకారం, హోమశాల, నైవేద్యాల తయారీ గదులు తదితరాల నిర్మాణానికి ఈ నిధులు వెచ్చించనున్నారు.