Begin typing your search above and press return to search.

పటేల్ విగ్రహ ఏర్పాటుపై వ్యతిరేకం.. ఎందుకు?

By:  Tupaki Desk   |   1 Nov 2018 5:30 PM GMT
పటేల్ విగ్రహ ఏర్పాటుపై వ్యతిరేకం.. ఎందుకు?
X
ప్రపంచంలోనే అతి పెద్ద సర్ధార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని మోడీ బుధవారం అంగరంగ వైభవంగా ఆవిష్కరించారు. అయితే అంతా హర్షం వ్యక్తం చేస్తున్న ఈ విగ్రహ ఏర్పాటును ఆ పరిసరాల్లోని 20 గ్రామాల ప్రజలు వ్యతిరేకించడం హాట్ టాపిక్ గా మారింది. మూడువందల మంది ఆదివాసీ రైతులు విగ్రహావిష్కరణను అడ్డుకోవడానికి ప్రయత్నించగా పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారట..

విగ్రహావిష్కరణ సందర్భంగా నర్మదా నది నిండుగా కనిపించడం కోసం సరోవర్ డ్యాం గేట్లను అర్జంటుగా ఎత్తి పటేల్ విగ్రహం వద్ద నీళ్లు నిలిపేలా అధికారులు చేశారు. అయితే ముందస్తు హెచ్చరికలు లేకుండా డ్యాం గేట్లు ఎత్తడంతో పరిసర గ్రామాల్లోని 30మంది రైతుల పంటలు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. దీంతో వారంతా పటేల్ విగ్రహావిష్కరణ రోజు ఆందోళన చేయగా.. దాదాపు 350మది ఆదివాసీ రైతులను పోలీసులు అరెస్ట్ చేశారు. పటేల్ విగ్రహం కోసం.. తమ పంటలను పాడుచేస్తారా అని వారు ఆందోళన నిర్వహిస్తున్నారు.

ఇప్పటికే సర్ధార్ విగ్రహానికి ఆరు కిలోమీటర్ల ముందు సరోవర్ డ్యాంకు కింద ఓ చిన్న డ్యామ్ నిర్మిస్తున్నారు. ఇది టూరిజానికి అనువుగా సరస్సుగా మారుస్తున్నారు. ఇందులో నీళ్లు నింపడం వల్ల ఇప్పటికే ఆరు గ్రామాలు నీటిలో మునిగిపోయాయి. డ్యామ్ పూర్తిగా నింపితే ఆరు గ్రామాలు మునిగిపోతాయట.. దీని వల్ల 20 గ్రామాలు - 70 ఆదివాసీ గ్రామాలకు నష్టమట.. దీంతో వారంతా సర్ధార్ విగ్రహ ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారు.