Begin typing your search above and press return to search.

రాష్ట్రాలు కాంగ్రెస్ కు.. కేంద్రం బీజేపీకి..

By:  Tupaki Desk   |   24 Oct 2019 8:26 AM GMT
రాష్ట్రాలు కాంగ్రెస్ కు.. కేంద్రం బీజేపీకి..
X
దేశ ఓటర్లు విలక్షణమైన తీర్పును ఇస్తున్నారు. రాష్ట్రాల్లో కాంగ్రెస్ ను గెలిపిస్తూ దేశంలో మాత్రం బీజేపీకి పట్టం కడుతున్నారు. దీన్ని బట్టి ఒకటే అర్థమవుతోంది. కేవలం మోడీ మేనియా, మోడీని కోరుకోవడం వల్లనే కేంద్రంలో బీజేపీ నిలుస్తుందని.. మోడీని చూసే కేంద్రంలో బీజేపీకి పట్టం కడుతున్నారని అర్థమవుతోంది..

కేంద్రంలో దేశ ఓటర్లకు రెండే ఆప్షన్లు.. ఒకటి మోడీ.. రెండు రాహుల్ గాంధీ.. రాహుల్ గాంధీ అపరిపక్వత, బేలాతనం.. యువకుడిగా ఉండడంతో ఆయనపై దేశభవిష్యత్ పెట్టడం దేశంలోని ఓటర్లకు ఇష్టం లేదు. అందుకే కేంద్రంలో మోడీ సారథ్యంలో ప్రభుత్వాన్ని కోరుకుంటున్న ఓటర్లు.. రాష్ట్రాల్లో మాత్రం బీజేపీ పాలనను అస్సలు కోరుకోవడం లేదని తాజా ఫలితాలను బట్టి అర్థమవుతోంది.

మొన్న తెలంగాణతోపాటు జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే ఫలితం కనిపించింది. తెలంగాణలో టీఆర్ఎస్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్ లలో కాంగ్రెస్ గెలిచింది. ఈశాన్య రాష్ట్రం మిజోరం మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్ఎఫ్) విజయం సాధించింది.

అంటే మొత్తం 5 రాష్ట్రాల్లో కాంగ్రెస్, 3, టీఆర్ఎస్ 1, ఎంఎన్ఎఫ్ 1 రాష్ట్రం దక్కించుకున్నాయి. బీజేపీకి గుండు సున్నా.. మూడు రాష్ట్రాల్లో బీజేపీ అధికారం కోల్పోయి కాంగ్రెస్ కు అప్పగించింది.

తాజాగా జరిగిన మహారాష్ట్ర, హర్యానాల్లో కూడా మహారాష్ట్రలో బీజేపీకి చావుతప్పి కన్నులొట్టబోయే ఫలితాలు వచ్చాయి. ఇక హర్యానాలో హంగ్ వచ్చేసింది. మిత్రపక్షాలతో అధికారం దిశగా కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది.

దీన్ని బట్టి దేశ ఓటర్లు మోడీని చూసి కేంద్రంలో అధికారం ఇస్తున్నారని అర్థమవుతోంది. ఇక రాష్ట్రాల్లో మాత్రం బీజేపీ పాలన వారికి నచ్చడం లేదు. అక్కడ సమర్థులైన కాంగ్రెస్ నేతల నాయకత్వాలకే మద్దతు పలుకుతున్నారు.

రాష్ట్రాలన్నీ కాంగ్రెస్ పరం అవుతున్నా ఆ పార్టీ అధినేతలు రాహుల్, సోనియా, ప్రియాంకలు ఆ దిశగా చొరవ మాత్రం చూపడం లేదు. సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ కాడి పారేయగా.. సోనియా, ప్రియాంకలు తాజా మహారాష్ట్ర, హర్యానాల్లో ప్రచారానికే రాలేదు. నడిపించే నాయకుడు లేకున్నా దేశ ప్రజలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ను నమ్ముతున్నారు. అదే కాంగ్రెస్ కాస్త గట్టిగా పోరాడితే ఆ పార్టీకి కేంద్రంలోనూ అధికారం దక్కే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మారాల్సిందల్లా కాంగ్రెస్ నేతలే