Begin typing your search above and press return to search.
రాష్ట్రాలు సరే... కేంద్రం సంగతేంటి....?
By: Tupaki Desk | 10 Feb 2023 9:00 PM GMTచెప్పేందుకే నీతులు అని వెనకటికి ఒక ముతక సామెత ఉంది. నీతులు ఎదుటి వారికే చెబుతారు. తమ దాకా వస్తే మాత్రం నీతి రీతి జాంతానై అన్నట్లుగా ఉంటారు. దేశాన్ని ఏలే ప్రధాని నరేంద్ర మోడీ మొత్తం 28 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పెద్దన్న లాంటి వారు. ఆయన ఏదైనా చెబితే అవును సుమా అని అనుకునే విధంగా ఉండాలి
అయితే దేశంలో మోడీ ఏలుబడిలో తొమ్మిదేళ్లలో చేస్తున్నది ఏంటి ఆయన రాష్ట్రాలలోని తమ తమ్ముళ్ళు అయిన ముఖ్యమంత్రులకు చెబుతున్నదేంటి అన్నది చూస్తే కచ్చితంగా ఎదుటి వారికే నీతులు అన్న సామెత గుర్తు రాక మానదు. రాష్ట్రాలు అప్పులు పెద్ద ఎత్తున చేస్తున్నాయి. జర జాగ్రత్త అంటూ ప్రధాని నీతులు చెప్పారు నిజంగా ఇది చాలా మంచిదే. పెద్దన్న హోదాలో ఆయన హెచ్చరించడం వరకూ ఓకే.
ఎందుకంటే డబ్బులు ఎక్కడైనా డబ్బులే. అప్పు ఎక్కడైనా తప్పే. అప్పులు చేస్తే చితికిపోతామని వర్తమానంలో ఒక శ్రీలంక, పాకిస్థాను లాంటి దేశాల ప్రస్తుత దుర్గతి ఉదాహరణ నిలుస్తోంది. మరి అలాంటిది రాష్ట్రాలు అన్నీ అప్పులు చేస్తే ఆ భారం దేశం మీద పడుతుంది. అవి చితికిపోవడమే కాకుండా దేశానికి పెను భారమని ప్రధాని చెప్పిన మాటను కూడా మననం చేసుకోవాల్సిందే.
ఏ రాష్ట్రం పేరు ఎత్తకుండా జనరలైజ్ చేస్తూ ప్రధాని అన్న మాటలు చూస్తే కొన్ని రాష్ట్రాలు తమ రాజకీయ ప్రయోజనం కోసం విచ్చలవిడిగా అప్పులు చేస్తున్నాయి. పొరుగు దేశాల ఆర్ధిక పతనాన్ని చూసి వారు అప్రమత్తం కావాలని ప్రధాని హితబోధ చేశారు. లేకుంటే ఆయా రాష్ట్రాలతో పాటు దేశం కూడా ఇబ్బంది పడుతుందని హెచ్చరించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే సందర్భంలో ప్రధాని పార్లమెంట్ లో ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
నిజంగా ప్రధాని చెప్పిన దాంట్లో అక్షరం ముక్క కూడా తప్పు లేదు పైగా ఆయన మంచిగానే చెప్పారు. కానీ ఇపుడు ఒకసారి దేశం గురించి కూడా ఆలోచిద్దాం. భారత దేశం అంతా సవ్యంగా చేస్తోందా. మోడీ పాలనలో అప్పులు ఏమీ లేవా అంటే 2023-24లో మొదలయ్యే కొత్త ఆర్ధిక సంవత్సరం లోనే ఏకగా 16 లక్షల కోట్లను అప్పులుగా తేవాలని సాక్షాత్తూ మోడీ సర్కారే తలపోస్తున్న వేళ అప్పుల గురించి ప్రధాని చెప్పడం అంటే రాష్ట్రాలు ఏమనుకుంటాయో కదా అన్నదే ఇపుడు చర్చగా ఉంది.
ఇక మోడీ ప్రధాని కాక ముందు దేశంలో అప్పులు చూస్తే అరవై లక్షల కోట్లుగా ఉంటే ఈ రోజు అది డబులు అయింది. అంటే ఆరున్నర దశాబ్దాల కాలంలో అనేక మంది ప్రధానులుగా చేసిన వేళ దేశానికి ఉన్న అప్పులు అరవై లక్షల కోట్ల రూపాయలు అంటే ఇపుడు లక్షా ఇరవై వేల కోట్ల రూపాయలుగా పెరిగిపోయిందంటే కేవలం తొమ్మిదేళ్ల కాలంలో ఇంత అప్పు ఏంటి అంటే కేంద్ర పెద్దలు ఏమని జవాబు చెబుతారో అన్న విమర్శలు విపక్షాల నుంచి వస్తున్నాయి.
మోడీ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చినపుడు చేస్తే దేశ వార్షిక రుణం 5.92 లక్షల కోట్లు ఉంది. అదే ఆ తరువాత పెరుగుతూ పోయింది. అలా చూసుకుంటే 2022-23 ఏడాదిలో 14.2 లక్షల కోట్లు కేంద్రం అప్పులు చేసింది. ఈ ఏడాది బడ్జెట్ లో చూస్తే ఆ రుణం కాస్తా 16 లక్షల కోట్ల రూపాయలు ఉండే అవకాశం ఉంది అని అంటున్నారు. మరి ఇన్ని లక్షల కోట్లలో రుణం అంటే భారత దేశం మీద ఎంత భారం అన్నది కూడా శ్రీమాన్ దేశ ప్రధాని మోడీ సాబ్ కూడా ఆలోచించాల్సి ఉంది అని అంటున్నారు.
ఇనేసి అప్పులకు వడ్డీల చెల్లింపు భారం తో భారత్ కృంగి పోతోంది అన్నది కూడా అంతా తెలుసుకోవాల్సి ఉంది. ఈ నూతన ఆర్ధిక సంవత్సరంలోనే ఏకంగా 4.4 లక్షల కోట్ల చెల్లింపు కేంద్ర ప్రభుత్వం మీద భారంగా ఉన్నాయి అంటనే భయపడాల్సింది అప్రమత్రం కావాల్సింది కేంద్ర పెద్దలు కదా అని అంతా అడుగున్న ప్రశ్నగా ఉంది. మొత్తానికి చూస్తే నరేంద్ర మోడీ తొమ్మిదేళ్ళ పాలనలో రుణ భారం నాలుగింతలు పెరిగింది అని ఆర్ధిక నివేదికలు తేటతెల్లం చేస్తున్నాయి.
మరి ఇంతలా అనకొండలా అప్పులు పెరిగిపోతూంటే దేశానికి పెద్దన్నగా ఉన్న కేంద్రం తన ఇంటిని చక్కదిద్దుకోకుండా రాష్ట్రాలూ జాగ్రత్త అంటే వింటాయా అన్నదే కీలకమైన పాయింట్. ఏది ఏమైనా ఒక్క మాట. కేంద్రం రాష్ట్రాలు రెండూ విచ్చలవిడిగా అప్పులు చేస్తున్నాయి. అది ఏదో నాటికి ఊబిగా మారకముందే అందరూ మేలుకోవాలి. అంతే తప్ప మీరు అప్పులు చేయవద్దు అని సుద్దులు చెప్పి కేంద్రం అప్పుల భారతాన్ని ఆవిష్కరిస్తే 140 కోట్ల మంది భారతీయులు మునిగిపోతారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.