Begin typing your search above and press return to search.

షియాలకు మూడినట్లేనా ?

By:  Tupaki Desk   |   19 Oct 2021 6:52 AM GMT
షియాలకు మూడినట్లేనా ?
X
ఇంతకాలం నివురుగప్పిన నిప్పులా ఉన్న వ్యవహారం ఒక్కసారిగా బయట పడిపోయింది. షియా ముస్లింలు ఎక్కడున్నా బయటకు లాగి చంపేస్తామంటూ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాదులు బహిరంగంగా చేసిన ప్రకటన సంచలనంగా మారింది. ఒక వర్గం వాళ్ళని చంపేస్తామంటూ బహిరంగంగా మరోవర్గం వార్నింగు ఇవ్వటం బహుశా ఇదే మొదటిసారేమో. గడచిన వారం రోజుల్లో ఆఫ్ఘనిస్తాన్ లోని రెండు మసీదుల్లో బాంబుదాడులు జరగటం అందరికీ తెలిసిందే.

రెండు బాంబు దాడుల్లో కలిపి సుమారు 200 మందికి పైగా చనిపోయారు. మరో 300 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే రెండు బాంబుదాడులు కూడా మసీదులోనే జరిగింది. మసీదులోనే బాంబు దాడులు ఎందుకు జరిగిందంటే అవి కేవలం షియా ముస్లింలు మాత్రమే ప్రార్ధనల్లో పాల్గొనే మసీదులు కాబట్టే. అంటే షియాలను టార్గెట్ చేసి మరీ చంపుతున్నట్లు అర్ధమవుతోంది.

ఇదే విషయాన్ని తాజా ఐఎస్ ఉగ్రవాదుల నేతలు బహిరంగంగానే చెప్పేశారు. మసీదుల్లోనే కాదు ఇళ్ళల్లో ఉన్న వాళ్ళని కూడా బయటకు లాగి చంపేస్తామని వార్నింగ్ ఇచ్చారు. బాగ్దాద్ నుండి ఖొరసాన్ వరకు షియా ముస్లింలు ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టకుండా వెతికి మరీ చంపేస్తామని ఐఎస్ ఉగ్రవాద నేతలు హెచ్చరించటం ముస్లిం సమాజంలో సంచలనంగా మారింది.

ముస్లింల్లో షియా-సున్నీ వర్గాలకు ఏమాత్రం పడదన్న విషయం తెలిసిందే. ఆఫ్ఘన్లో సున్నీలదే ఆధిపత్యం. పైగా అధికారంలో ఉన్న తాలిబన్లతో పాటు హక్కానీ నెట్వర్క్ లో కూడా మెజారిటి సున్నీలేనట. దాంతో షియా తెగ ముస్లింలను సున్నీలు వెంటపడి వేటాడుతున్నారు. పైకి షియాల మీద సున్నీలు చేస్తున్న దాడిగా బహిరంగంగా ప్రకటించకపోయినా ఐఎస్ ఉగ్రవాదులన్న ముసుగులో సున్నీలే దాడులు మొదలుపెట్టేశారనే ప్రచారం పెరిగిపోతోంది.

దేశంలో షియాల మీద పదే పదే సున్నీలు దాడులు చేసి చంపేస్తున్నారనే ప్రచారం యావత్ ముస్లిం సమాజం మీద తీవ్రమైన ప్రభావం చూపుతోందట. ఎందుకంటే ముస్లిందేశాల్లో షియా-సున్నీల గొడవలున్నా ఇంత బాహాటంగా దాడులు చేసి చంపేయటం జరగటంలేదు. ఏవో లోకల్ గా గొడవలు జరగటం సద్దుమణిపోవటం మామూలే. కానీ ఆఫ్ఘన్లో ఐఎస్ ఉగ్రవాద నేతలు బహిరంగంగా షియాలను చంపేస్తామని హెచ్చరించి మరీ చంపటం మాత్రం జరగటంలేదు. ఆఫ్ఘన్లో మొదలైన కొత్త పోకడలు చివరకు పరిస్దితులను ఎటు తీసుకెళతాయో అనే టెన్షన్ పెరిగిపోతోంది.