Begin typing your search above and press return to search.

కేటీఆర్ తో గేమ్ ఛేంజ్ ప్లాన్ సెట్ చేసిన కేసీఆర్

By:  Tupaki Desk   |   5 March 2023 8:02 AM GMT
కేటీఆర్ తో గేమ్ ఛేంజ్ ప్లాన్ సెట్ చేసిన కేసీఆర్
X
అపర చాణక్య కేసీఆర్ మరో గేమ్ మొదలుపెట్టారు.. స్టేట్ అండ్ సెంట్రల్ లో ఒకేసారి పాగా వేసేందుకు నయా స్కెచ్ వేశారు.. ఇన్నాళ్లు కేసీఆర్ జాతీయ రాజకీయాలకే పరిమితం అయ్యారని, తెలంగాణను పట్టించుకోవడం లేదన్న ప్రచారం సాగింది.. మరోవైపు తెలంగాణ బీఆర్ఎస్ కు అధ్యక్షుడు ఎవరనేది తెలియకపోవడంతో పార్టీని ఎవరు పట్టించుకుంటరాన్న చర్చ బీఆర్ఎస్ లో జరిగినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో విపక్షాలు సైతం దీనిని బేస్ గా చేసుకొని కేసీఆర్ తెలంగాణను పట్టించుకోవడం లేదన్న విమర్శలు చేశారు. వీటన్నింటికి చెక్ పెట్టేందుకు కేసీఆర్ భారీ వ్యూహం రచించారు. ఇతర రాష్ట్రాల్లో బీఆర్ఎస్ ను విస్తరించే పనిలో కేసీఆర్ తలమునకలు కాగా.. రాష్ట్ర బాధ్యతలను ఆయన కుమారుడు కేటీఆర్ కు అప్పజెప్పినట్లు తెలుస్తోంది.

రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్షాలు యాత్రలు, సమావేశాల పేరిట జనాల్లోకి చొచ్చుకుపోతున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం జాతీయ రాజకీయాలపై దృష్టిపెట్టారన్న చర్చ సాగుతోంది. ఇందులో భాగంగా మహారాష్ట్రలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ ను పోటి చేయించేందుకు రెడీ అవుతున్నారు.

ఇప్పటికే ఉత్తర తెలంగాణకు చెందిన నేతలతో సమావేమై మహారాష్ట్రలోని కొన్న జిల్లాలను వారికి కేటాయించారు. ఆయా జిల్లాల్లో వీరు బీఆర్ఎస్ వ్యవహారాలు చూసుకుంటారు. మరోవైపు కర్ణాటకలో జేడీఎస్ తో కలిసి పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. అటు ఏపీలోను పార్టీని విస్తరించేలా వ్యూహం రచిస్తున్నారు.

ఈనేపథ్యంలో కేసీఆర్ తెలంగాణను పట్టించుకోవడం లేదన్న ప్రచారం సాగింది. మరోవైపు పక్క రాష్ట్ర ఏపీకి అధ్యక్షుడిని ప్రకటించిన కేసీఆర్ తెలంగాణకు బాస్ ఎవరో తేల్చలేదన్నారు. ఈ తరుణంలో తనకు అధ్యక్ష పదవి ఇవ్వలేదని కేటీఆర్ కొన్ని రోజుల పాటు అలిగారని అన్నారు. అందుకే ఆయన బీఆర్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొనలేదని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో ప్రతిపక్షాలు సైతం బీఆర్ఎస్ గా మారిన తరువాత తెలంగాణను పట్టించుకోవడం లేదని, ఆయన దృష్టంతా జాతీయ రాజకీయాలపైనే పెడుతున్నారని విమర్శించారు. మరోవైపు బీఆర్ ఎస్ పార్టీలోనూ ఎన్నికలు సమీపిస్తున్న టికెట్ కోసం ఎవరిని సంప్రదించాలో అర్థం కాక అయోమయంలో పడ్డారు.

అయితే వీటికి కేసీఆర్ చెక్ పెట్టినట్లు తెలుస్తోంది. రాష్ట్ర బాధ్యతలు చూసుకొమ్మని కేటీఆర్ ను రంగంలోకి దించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా కేటీఆర్ రోజూ ఏదో ఒక నియోజకవర్గంలో పర్యటిస్తున్నారని అంటున్నారు. ఆయా ప్రాంతాలకు వెళ్లడమే కాకుండా రాష్ట్ర విషయాలపై తీవ్రంగా చర్చిస్తున్నారు. మరోవైపు ప్రతిపక్షాల విమర్శలకు కేటీఆర్ కౌంటర్లు వేస్తున్నారు. కేసీఆర్ బాధ్యతలన్నీ కేటీఆర్ నిర్వహిస్తుండడంతో నెక్ట్స్ సీఎం కేటీఆర్ నేనా అన్న జోష్ బీఆర్ఎస్ లో నెలకొంది.

ప్రతిపక్షాలకు అంతుచిక్కకుండా కేసీఆర్ వ్యూహం రచిస్తున్నారు. ఏ విమర్శలనైనా ఎదుర్కొనేందుకు ధీటుగా స్కెచ్ వేస్తున్నారు. ఇప్పుడు కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో పూర్తిగా నిమగ్నమై ఉండగా కేటీఆర్ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తూ నాయకులకు ధీమా కలిగిస్తున్నారు.

ఈ నేపథ్యంలో కొందరు టికెట్ కోసం కేటీఆర్ ను కలుస్తున్నారు. వారికి కేటీఆర్ హామీ ఇస్తుండడం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఎన్నికల సమయం పీక్ స్టేజికి వచ్చినప్పుడు కేసీఆర్ రంగంలోకి దిగుతారని ప్రచారం సాగుతోంది. అప్పటి వరకు కేటీఆర్ జనాల్లో తిరుగుతూ పార్టీ కార్యక్రమాలను విస్తృతం చేయనున్నారు. ఇలా కేసీఆర్ సెంట్రల్, కేటీఆర్ స్టేట్ పాలిటిక్స్ తో బీజీ అయ్యారు. అదృష్టం కలిసి వస్తే రెండు చోట్లా బీఆర్ఎస్ జెండా ఎగిరినా ఆశ్చర్యం లేదని కొందరు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.