Begin typing your search above and press return to search.

కరోనా లక్షణాలుంటే ట్రీట్మెంట్ మొదలెట్టండి : కేంద్రం గైడ్‌లైన్స్ !

By:  Tupaki Desk   |   29 April 2021 6:00 AM GMT
కరోనా లక్షణాలుంటే ట్రీట్మెంట్ మొదలెట్టండి : కేంద్రం గైడ్‌లైన్స్ !
X
దేశంలో కరోనా సెకండ్ వేవ్ జోరు కొనసాగుతుంది. అయితే, కరోనా లక్షణాలు కనిపించిన తర్వాత , నిర్దారణ పరీక్షలు చేయించుకుని ఫలితాలు వచ్చేవరకూ వేచి చూసి , పాజిటివ్ వస్తే అప్పుడు సరైన సమయానికి చికిత్స అందక అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఆర్టీ పీసీఆర్ పరీక్షలో పాజిటివ్‌ అని నిర్ధారణ అయితేనే చికిత్సకు చేర్చుకుంటామని ఆస్పత్రులు చెప్తున్నాయి. దీనితో ప్రాణ నష్టం తగ్గించడానికి కేంద్రం రంగంలోకి దిగింది. కరోనా చికిత్సలో రాష్ట్రాలు, ఆసుపత్రులకు స్పష్టమైన కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం రాత్రి మార్గదర్శకాలను జారీచేసింది. జలుబు, దగ్గు, గొంతునొప్పి, జ్వరం తదితర కరోనా లక్షణాలు కనిపిస్తే నిర్ధారణ పరీక్షల ఫలితం కోసం వేచిచూడకుండా సత్వరమే చికిత్సను ప్రారంభించాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆదేశించింది. ఫలితాల కోసం చూస్తే ప్రాణాలకే ప్రమాదం అని కేంద్రం కీలక మార్గదర్శకాలు విడుదల చేసింది.

స్వల్ప లక్షణాలున్న బాధితులకు, ఆర్‌టీ పీసీఆర్‌ పరీక్షలో నెగెటివ్‌ వచ్చినా లక్షణాలు కనిపిస్తున్నవారికి అందజేయాల్సిన చికిత్సలపై ఆరోగ్య శాఖలోని కొందరు వైద్యనిపుణులతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఐసీఎంఆర్‌, ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్లు డాక్టర్‌ బలరాం భార్గవ, డాక్టర్‌ రణదీప్‌ గులేరియా తదితరులతో పాటు పలు రాష్ట్రాలకు చెందిన కొవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సభ్యులు ఇందులో పాల్గొన్నారు. కొవిడ్‌ చికిత్సల్లో జాప్యాన్ని నివారించి త్వరితగతిన బాధితులకు వైద్యసేవలు ప్రారంభించడంపై ప్రధానంగా చర్చించారు. దీని ద్వారా మరణాల రేటు కూడా తగ్గించవచ్చు అని అన్నారు. కొవిడ్‌ నిర్ధారణ పరీక్ష చేయించుకుని ఫలితం వచ్చే వరకూ వేచి చూసే సందర్భాల్లో బాధితుల ఆరోగ్యం హఠాత్తుగా క్షీణిస్తోంది. తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరినప్పుడు చికిత్స కష్టమై కొన్నిసార్లు పరిస్థితి దిగజారుతోంది. దీన్ని నివారించడానికి బుధవారం సమీక్షలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

కొవిడ్‌ లక్షణాలు బయటపడితే నిర్ధారణ పరీక్షల ఫలితాల కోసం వేచి చూడకుండా వెంటనే చికిత్సను ప్రారంభించాలి. హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడూ పర్యవేక్షించాలి. వారి పరిస్థితి విషమిస్తున్నట్లుగా గుర్తించినా వెంటనే ఆసుపత్రికి తరలించాలని సూచించింది. ఆర్‌ టీపీసీఆర్‌ పరీక్షలో నెగెటివ్‌ వచ్చినా, బాధితుల్లో లక్షణాలు కనిపిస్తుంటే, దాన్ని కరోనా వైరస్ గానే భావించి చికిత్స అందజేయాలి. ఇంటి దగ్గర చికిత్స పొందుతున్న బాధితులకు ఔషధాలు అందిస్తున్నా కూడా జ్వరం తగ్గకుండా శ్వాస తీసుకోవడం కష్టమవుతున్నట్లుగా గుర్తిస్తే వారికి కూడా సత్వరమే స్టెరాయిడ్‌ చికిత్సను ప్రారంభించాలని కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. కేంద్రం ఆదేశాల్ని బట్టి చూస్తే ఇకపై కరోనా లక్షణాలు ఉన్నాయి అనే అనుమానం వచ్చినా కూడా ట్రీట్మెంట్ చేయచ్చు. ఇలా చేయడం ద్వారా ఆ తరవాత రిపోర్ట్స్ లో పాజిటివ్ అని తెలిసినా కూడా పెద్దగా భయపడాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే అప్పటికే ట్రీట్మెంట్ ప్రారంభం అయ్యి ఉంటుంది. కాబట్టి కరోనా నుండి కోలుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒకవేల ఆ రిపోర్ట్స్ లో నెగటివ్ వస్తే ఆ తర్వాత వారిని డీఛార్జ్ చేసి పంపేయచ్చు.