Begin typing your search above and press return to search.
సింథటిక్ బీఫ్ తినడం మొదలెట్టండి .. ఆ దేశాలకి బిల్ గేట్స్ పిలుపు !
By: Tupaki Desk | 17 Feb 2021 11:30 PM GMTమైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు , అపర కుబేరుడు బిల్ గేట్స్ ప్రపంచంలో ఉన్నటువంటి ధనిక దేశాలకు ఓ పిలుపు ఇచ్చారు. ఇక నుంచి మనమందరం 100శాతం సింథటిక్ బీఫ్ ( సింథటిక్ బీఫ్ అంటే .. ల్యాబ్ లో తయారు చేసిన గొడ్డు మాంసం) తినడం ప్రారంభించాలని బిల్స్ గేట్స్ పిలుపునిచ్చారు. వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో సహాయపడటానికి సంపన్న దేశాలు ఈ పని చేయక తప్పదని గేట్స్ స్పష్టం చేశారు.
గ్రీన్ హౌస్ గ్యాస్ ఉద్గారాలను తగ్గించడానికి ఏం చేయాలనే అంశంపై ఎంఐటీ టెక్నాలజీ రివ్యూవ్ ఇంటర్వ్యూలో బిల్ గేట్స్ తన ఐడియాలను వెల్లడించారు. అన్ని ధనిక దేశాలు 100శాతం సింథటిక్ గొడ్డు మాంసం వైపుకు వెళ్లాలని నేను అనుకుంటున్నా అని మీథేన్ ఉద్గారాలను ఎలా తగ్గించాలో అడిగినప్పుడు గేట్స్ చెప్పారు.మీరు రుచి వ్యత్యాసానికి అలవాటుపడొచ్చు. కాలక్రమేణా దాన్ని మరింత రుచిగా చూడబోతున్నారు. చివరికి, ఆ ఆకుపచ్చ ప్రీమియం నిరాడంబరంగా ఉంటుంది అని బిల్ గేట్స్ అన్నారు. బిల్ గేట్స్ రాసిన పుస్తకం వాతావరణ విపత్తును ఎలా నివారించాలి "How to avoid a Climate Disaster" ఇటీవల మార్కెట్ లోకి వచ్చింది.