Begin typing your search above and press return to search.
14 సెకన్ల లాజిక్.. అమ్మాయిని చూస్తే కేసే!
By: Tupaki Desk | 16 Aug 2016 6:29 AM GMTఅమ్మాయిలపై రోజురోజుకీ లైంగిక వేధింపులు ఎక్కువైపోతున్నాయి. ప్రతీరోజూ దేశంలో ఏదో ఒకచోట - ఎవరో ఒకరు లైంగిక వేదింపులకు పాల్పడుతున్నారు. ఇక ఈవి టీజింగుల సంగతి చెప్పేదేమింది అనే విషయాలు తెలిసినవే. అయితే ఈ విషయాలపై తాజాగా ఒక పోలీస్ అఫీసర్ డిఫరెంట్ గా స్పందించారు. ఈ స్పందనపై కొంతమంది సూపర్ సూపర్ అని మెచ్చుకుంటుంటే.. మరి కొందరు మత్రం సెటైర్లు వేస్తున్నారు. ఇంతకూ ఆ పోలీస్ ఆఫీసర్ చెప్పిన లాజిక్ ఏమిటో ఇప్పుడు చూద్దాం...
అమ్మాయిలపై జరుగుతున్న లైంగిక వేధింపులను అరికట్టేందుకు కేరళలోని ఓ ఎక్సైజ్ కమిషనర్ రిషిరాజ్ సింగ్ ఒక సూచన చేశారు. పంద్రాగస్టు వేడుకల సందర్భంగా కొచ్చిలో ఏర్పాటుచేసిన ఓ బహిరంగ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన.. ఎవరైనా ఒక అబ్బాయి పద్నాలుగు సెకన్లపాటు తదేకంగా ఒక అమాయి కళ్లలోకి చూస్తే వెంటనే ఎఫ్ ఐఆర్ నమోదు చేయవచ్చని అన్నారు. అలాగే.. బహుశా ఈ విషయం ఎవరికీ తెలియదేమో అని కూడా వ్యాఖ్యానించారు. కాకపోతే.. ఇలాంటి కేసు ఇప్పటివరకూ ఒక్కటికూడా నమోదుకాలేదని - అలా జరిగి ఉంటే మాత్రం అమ్మాయిలపై వేధింపులు తగ్గుముఖం పట్టేవని ఆయన అభిప్రాయపడ్డారు. కేరళలో మహిళలు - యువతులపై జరుగుతున్న ఆకృత్యాలను తన ప్రసంగంలో ప్రస్థావించిన రిషిరాజ్ సింగ్.. ఎవరైనా అభ్యంతరకరంగా మాట్లాడినా, వెనుకాలే ఫాలో అవుతూ విసిగించినా.. వెంటనే స్పందించి - వారికి అక్కడే బుద్ధి చెప్పాలని అన్నారు.
ఈ సమయంలో రిషిరాజ్ సింగ్ చెప్పిన విషయాలు బాగానే ఉన్నాయి కానీ.. ఈ 14 సెకన్ల లాజిక్ ఏమిటో అర్ధంకావడంలేదని చాలామంది వ్యాఖ్యానించారు. ఈ విషయాలపై స్పందించిన కేరళ రాష్ట్ర క్రీడల మంత్రి ఈపీ జయరాజన్.. రిషిరాజ్ సింగ్ ముందుగా న్యాయ చట్టాలన్నింటిని తెలుసుకుంటే మంచిదని.. ఈ పాయింట్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారో చెప్పాని అన్నారు. కాసేపు ఆయన చెప్పిందే వాస్తవమైతే.. సన్ గ్లాసెస్ పెట్టుకుని చూసేవాళ్లను ఎలా గుర్తించాలని, వారు తమవైపే చూస్తున్నారన్న విషయం ఎలా తెలుసుకోవాలని అని ప్రశ్నించారు. ఈ విషయంపై పోలీస్ ఆఫీసర్ చెప్పింది బాగానే ఉంది కానీ 14సెకన్ల లాజిక్కే అతిగా ఉందని కొందరంటుంటే... ఇకపై అమ్మాయిలు సెన్సార్స్ పెట్టుకుని అలా చూసినవారిని గుర్తించి మ్రోగేలా అలారాలు అమర్చుకోవాలని కామెంట్స్ విసురుతున్నారు.