Begin typing your search above and press return to search.
అందుకే టోక్యోలో ఆమె అలా ఉండేదట.. స్టార్ రెజ్లర్ తాజా మాట
By: Tupaki Desk | 14 Aug 2021 5:34 AM GMTఒక దేశం నుంచి ప్రాతినిధ్యం వహించే క్రీడాకారులు ఒకే చోట బస చేయటం.. కలిసి ఉండటం చేస్తారు. అందుకు భిన్నంగా స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్ తీరు ఉందన్న విమర్శలు రావటం తెలిసిందే. మిగిలిన వారి కంటే తాను ప్రత్యేకమన్నట్లుగా ఫోజు కొట్టిందని.. టోక్యోలోని భారత టీంతో కాకుండా.. తాను సపరేట్ గా ఉండటంతో పాటు.. మిగిలిన వారి పట్ల దారుణంగా ఆమె వ్యవహారశైలి ఉండేదన్న ఆరోపణలు తెలిసింది. పతకం ఖాయమని భావించిన వినేశ్ జర్నీ.. క్వార్టర్ ఫైనల్స్ ముగియటంతో ఆమెపై ఆశలు పెట్టుకున్న వారంతా తీవ్ర నిరాశకు గురయ్యారు.
టోక్యో నుంచి స్వదేశానికి వచ్చిన వెంటనే ఆమె క్రమశిక్షణారాహిత్యానికి పాల్పడిందంటూ ఆమెపై జాతీయ రెజ్లింగ్ సమాఖ్య తాత్కాలిక సస్పెన్షన్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. అప్పటికే ఆమెపై నెగిటివ్ వార్తలు మీడియాలో పెద్ద ఎత్తున రావటంతో.. ఆమెపై తీసుకకున్న చర్యలపై ఎలాంటి వ్యతిరేకత వ్యక్తమైంది. అంతేకాదు.. ఆమె తీరు టోక్యోలో తేడా ఎందుకు ఉందన్న మాటను ఎవరు అడిగింది లేదు.
ఆమెపై ఆరోపణ రావటం.. చర్యలు తీసుకోవటమే తప్పించి.. అసలేం జరిగిందన్న ప్రశ్న కానీ.. ఆమె వాదన ఏమిటన్న దానిపై ఎవరూ ఫోకస్ చేసింది లేదు. ఇదిలా ఉంటే.. తాజాగా ఆ కొరతను తీర్చే ప్రయత్నం చేసిందో మీడియా సంస్థ. తాజాగా ఆమెతో మాట్లాడిన సదరు సంస్థ.. టోక్యోలో ఆమె తేడా తీరుపై వస్తున్న ఆరోపణల గురించి ప్రశ్నించింది. దీనికి వినేశ్ ఫోగెట్ రియాక్టైంది.
తాను శిక్షణలో భాగంగా హంగేరి వెళ్లానని.. అక్కడి నుంచి నేరుగా ఒలింపిక్స్ గ్రామానికి చేరుకున్నట్లు చెప్పింది. ‘ఒకవేళ నాకు విమానంలో కొవిడ్ సోకి ఉంటే.. నా సహచరులందరికి దాన్ని అంటించినదాన్ని అవుతా. భారత్ లో ఉన్నప్పుడు నేను రెండు సార్లు కొవిడ్ బారిన పడ్డా. అందుకే.. మనవాళ్లను రిస్కులో పెట్టటం నాకు ఇష్టం లేదు. అందుకే రెండు మూడు రోజులు నేను ప్రత్యేకంగా ఉన్నాను. అలాంటప్పుడు నేనెలా క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినట్లు అవుతాను చెప్పండి’ అని ప్రశ్నించింది.
హంగేరి నుంచి నేరుగా ఒలింపిక్స్ గ్రామానికి చేరుకున్న వినేశ్.. ఫోజు కొట్టేదని.. మిగిలిన వారితో కలిసి ఉండేందుకు ఆమె ఏ మాత్రం ఇష్టం చూపేది కాదని.. ఆమె వేరుగా ఉండేదని.. ఆమె తీరు మిగిలిన అథ్లెట్లు ఫీలయ్యేలా ఉందన్న వార్తలు వచ్చాయి. అయితే.. వాస్తవం ఏమిటన్నది ఆమె మాట విన్నప్పుడు అర్థమవుతుంది. ఇక.. తన ఫ్యూచర్ గురించి వినేశ్ నోటి నుంచి వచ్చిన మాటలు కొత్త సందేహాలకు తావిచ్చేలా ఉన్నాయని చెప్పాలి.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తాను మళ్లీ రెజ్లింగ్ ఆడతానో లేదో తెలియదని వినేశ్ వ్యాఖ్యానించింది. మన దేశంలో ఎంత త్వరగా ఎదుగుతారో అంతే వేగంగా పతనమవుతారని.. ఒక్క పతకం చేజారిందంటే వాళ్ల కెరీర్ ముగిసినట్లేనని ఆమె వ్యాఖ్యానించారు. తానెప్పుడు రెజ్లింగ్ లోకి తిరిగి వస్తానో తెలీదని.. అసలు వస్తానో రానో కూడా చెప్పలేనని ఆమె వ్యాఖ్యానించటం గమనార్హం. తాజాగా చోటు చేసుకున్న పరిణామాలతో తాను మానసికంగా కుంగిపోయినట్లుగా ఆమె వ్యక్తం చేసిన ఆవేదన చూసినప్పుడు అయ్యో అనిపించకుండా ఉండదు.