Begin typing your search above and press return to search.

అమ‌రాతికి స్టార్ హోట‌ళ్లు

By:  Tupaki Desk   |   5 Nov 2017 7:24 AM GMT
అమ‌రాతికి స్టార్ హోట‌ళ్లు
X
విభ‌జ‌న కార‌ణంగా రాజ‌ధాని న‌గ‌రం లేని ఏపీలో ఇప్పుడిప్పుడే ప‌రిస్థితులు ఒక కొలిక్కి వ‌స్తున్నాయి. విభ‌జ‌న జ‌రిగిన మూడున్న‌రేళ్ల త‌ర్వాత రాజ‌ధాని న‌గ‌ర‌మైన అమ‌రావ‌తిని భారీ ఎత్తున నిర్మించాల‌ని ఏపీ స‌ర్కారు భావిస్తోంది. ఇందులో భాగంగా ఇప్ప‌టికే ప్లాన్ సిద్ధం చేసిన బాబు.. స‌చివాల‌యం.. హైకోర్టు నిర్మాణానికి డిజైన్ల‌ను సిద్ధం చేసే ప‌నిలో ఉన్నారు. ఒక్కొక్క‌టిగా వ‌స‌తులు రాజ‌ధానికి స‌మ‌కూరుతున్న వేళ‌.. ప‌లు జాతీయ‌.. అంత‌ర్జాతీయ స్థాయి గ్రూపులు అమ‌రావ‌తిలో స్టార్ హోట‌ళ్లు నిర్మించేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు.

అమ‌రావ‌తిలో నిర్మించే స్టార్ హోట‌ళ్ల‌కు గిరాకీ పెద్ద‌గా ఉండ‌కున్నా.. రానున్న రోజుల్లో అక్యుపెన్సీ భారీగా పెరిగే అవ‌కాశం ఉంటుంద‌ని.. ఆ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని హోట‌ళ్లను నిర్మించేందుకు ప‌లు కంపెనీలు సిద్ధ‌మవుతున్నాయి. ఒక అంచ‌నా ప్ర‌కారం 2020 నాటికి అమ‌రావ‌తిలో 1200 ఆధునాతన హోట‌ల్ గ‌దులు అందుబాటులోకి వ‌చ్చే అవ‌కాశం ఉంంద‌ని సీఆర్ డీఏ భావిస్తోంది.

ఇదే స‌మ‌యంలో హోట‌ళ్ల‌ను ఏర్పాటు చేయాల‌ని భావిస్తున్న కంపెనీల కోర్కెల్ని ఆమోదించాల‌ని భావిస్తోంది. ఇప్ప‌టికే సీఎం చంద్ర‌బాబుకు హోట‌ల్ కంపెనీలు పెట్టుకున్న ప్ర‌తిపాద‌న‌ల్ని ఆయ‌న దృష్టికి తీసుకెళ్ల‌గా.. బాబు వాటిని ఓకే అనేందుకు స‌ముఖంగా ఉన్నార‌ని చెబుతున్నారు. అన్ని అనుకున్న‌ట్లు జ‌రిగితే త్వ‌ర‌లోనే అధికారిక ఉత్త‌ర్వులు వెలువ‌డ‌నున్నాయి. ఏపీ రాజ‌ధానికి వీలైన‌న్ని స్టార్ హోట‌ళ్ల‌ను తీసుకొచ్చేలా రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తోంది. కంపెనీలు వ‌చ్చే కొద్దీ ఏపీ రాజ‌ధాని బ్రాండ్ వాల్యూ అంత‌కంత‌కూ పెరుగుతుంద‌ని.. మిగిలిన రంగాల వారు రాజ‌ధాని ప్రాంతంలో పెట్టుబ‌డులు పెట్ట‌టానికి హోట‌ళ్ల సౌక‌ర్యం కీల‌క‌భూమిక‌గా మారుతుంద‌ని చెబుతున్నారు.

దేశ విదేశాల్లో హోట‌ళ్ల‌ను నిర్వ‌హిస్తున్న ప్ర‌ముఖ బ్రాండ్లు అమ‌రావ‌తిలో పెట్టుబ‌డులు పెట్ట‌నున్నారు. అమ‌రావ‌తిలో పెట్టుబ‌డులు పెట్టాల‌ని భావిస్తున్న ప్ర‌ముఖ హోట‌ల్ బ్రాండ్ల‌ను చూస్తే.. ఇంట‌ర్ కాంటినెంట‌ల్‌.. హిల్ట‌న్‌.. మారియ‌ట్‌.. మారిగోల్డ్‌.. గ్రీన్ పార్క్‌.. ఫార్య్చూన్‌.. తాజ్.. పార్క్‌.. జీఆర్‌టీ.. బెస్ట్ వెస్ట్ర‌ర్న్‌.. ద‌స్ ప‌ల్లా.. లీలా.. ఒబెరాయ్ అండ్ మారియ‌ట్‌.. ఎస్ పీజీ లాంటివి ఉన్నాయ‌ని చెబుతున్నారు. త్రీ..ఫోర్‌.. ఫైవ్ స్టార్ హోట‌ళ్ల‌కు వ‌రుస‌గా వంద‌.. 150.. 200 గ‌దులు ఉండాల‌ని సీఆర్ డీఏ చెబుతోంది.

త్రీ.. ఫోర్‌.. ఫైవ్ స్టార్ హోట‌ళ్ల‌లో వ‌రుస‌గా 50.. 75.. 75-100.. 100.125 గ‌దులు ఉండేలా నిబంధ‌న‌ల్ని స‌వ‌రించాల‌ని హోట‌ల్ కంపెనీలు కోరుతున్నాయి. వీటికి అనుగుణంగా ఏపీ స‌ర్కారు ఓకే అనే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. హోట‌ల్ కంపెనీలు కోరిన‌ట్లుగా అనుమ‌తుల‌కు ప్ర‌భుత్వం ఓకే అని చెప్పి.. భూమి కేటాయిస్తే 30 నెల‌ల్లో నిర్మాణాల్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే.. దీన్ని 48 నెల‌ల‌కు పొడిగించాల‌ని కంపెనీలు కోరుతున్నాయి. రాజ‌ధానిలో నిర్మించే స్టార్ హోట‌ళ్ల‌కు ఎక‌రం రూ.3కోట్ల చొప్పున కేటాయించాల‌ని సీఆర్ డీఏ రూల్ పెట్టుకుంది. అయితే.. దీన్ని కోటికి త‌గ్గించాల‌ని హోట‌ళ్ల యాజ‌మాన్యాలు కోరుతున్నాయి. అయితే.. అటు ప్ర‌భుత్వం.. ఇటు కంపెనీలు చెప్పిన‌ట్లు కాకుండా మ‌ధ్యేమార్గంగా ఎక‌రం రూ.1.5కోట్ల ధ‌ర‌ను నిర్దేశించాల‌ని భావిస్తున్న‌ట్లుగా చెబుతున్నారు. హోట‌ళ్లు కోరిన‌ట్లుగా ప్ర‌భుత్వం కానీ ఓకేఅంటే..రానున్న ఐదారేళ్ల‌లో అమ‌రావ‌తి ప్రాంతంలో భారీ ఎత్తున స్టార్ హోట‌ళ్లు రావ‌టం ఖాయ‌మ‌ని చెబుతున్నారు.