Begin typing your search above and press return to search.
ఆ విషయం చెప్పడానికి సిగ్గుపడను : విరాట్ కోహ్లీ
By: Tupaki Desk | 9 May 2023 9:58 PM GMTవిరాట్ కోహ్లి - అనుష్క శర్మ భారత్ లోనే ఒక ప్రముఖ జంట.. విరాట్‌కు అనేక సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో 246 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు, విరాట్ ను క్రీడాకారుడిగా.. అతడి ఆటలోని సామర్థ్యాన్ని , నటనా యాడ్స్ లలో చాతుర్యాన్ని మెచ్చుకుంటూనే ఉంటారు. విరాట్ ను అభిమానులు క్రికెట్ కు మరో దేవుడిగా కొలుస్తారు. విరాట్ -అనుష్క భారతదేశంలో పవర్ కపుల్స్‌లో ఒకరిగా స్థిరంగా కలిసి కనిపిస్తారు.
ఇటీవల జరిగిన బిర్లా ఎస్టేట్స్ మీట్ అండ్ గ్రీట్ ఈవెంట్‌లో విరాట్ కోహ్లీ తన జీవిత భాగస్వామి, భార్య అనుష్క -కుమార్తె వామిక గురించి ఎమోషనల్ గా అభిప్రాయపడ్డాడు. తన భార్య అనుష్క శర్మ- కుమార్తె వామికతో గడపడం తన జీవితంపై ఎలా సానుకూల ప్రభావాన్ని చూపిందో వివరించాడు.
అనుష్క తనను ఎలా మంచి వ్యక్తిగా చేసిందో ఒప్పుకోవడంలో ఎలాంటి సిగ్గు పడను అంటూ ఓపెన్ గా విరాట్ పంచుకున్నాడు. అంతేకాదు, విరాట్ తనతో పాటు అనుష్క , వామిక కలిసి నడుస్తున్న ఫొటోను షేర్ చేసి కామెంట్ చేశాడు. తనకు ఇల్లే సర్వస్వం అని.. కుటుంబంతో గడపడం చాలా ఇష్టమని పేర్కొన్నాడు. విరాట్ నుండి ఈ బాధ్యతాయుతమైన మాటలను విన్న అభిమానులు విరాట్ , అతని కుటుంబానికి మద్దతుగా సందేశాల ద్వారా తమ ప్రేమను వ్యక్తం చేస్తున్నారు.
విరాట్ కోహ్లీ - అనుష్క శర్మ మైంత్రా, ప్యూమా, లైవ్‌స్పేస్, టూత్సీ , మాన్యవర్ వంటి అనేక బ్రాండ్‌లకు అంబాసిడర్ లుగా వ్యవహరిస్తూ ప్రభావవంతమైన భాగస్వామ్యానికి ప్రసిద్ధి చెందారు. కోహ్లీ తన సొంత బ్రాండ్ వ్రాగ్న్ వ్యవస్థాపకుడు. వీరి ఉమ్మడి నికర ఆస్తుల విలువ రూ. 1250 కోట్లుగా అంచనా వేయబడింది.