Begin typing your search above and press return to search.
మైనర్ తో సెక్స్ చేసిన స్టార్ అథ్లెట్.. నేరం రుజువైతే?
By: Tupaki Desk | 18 Nov 2020 8:30 AM GMTస్టార్ హోదా సంపాదించుకోవటం అంత తేలికైన విషయం కాదు. ఒక రంగంలో తిరుగులేని స్థానానికి చేరుకున్నప్పుడు అన్ని విషయాల్లోనూ ఒళ్లు దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకు భిన్నంగా వ్యవహరిస్తే వచ్చే చిక్కులు ఎలా ఉంటాయన్నది స్టార్ అథ్లెట్ ఉదంతాన్ని చూస్తే ఇట్టే అర్థమవుతుంది. కెన్యా స్టార్ అథ్లెట్.. రియో ఒలింపిక్స్ స్టీపుల్ ఛేజ్ పసిడి విజేత క్రిపుటో.
గత నెలలో 15 ఏళ్ల మైనర్ బాలికతో సెక్స్ చేశారన్న కేసు అతనిపై నమోదైంది. దీంతో పాతికేళ్ల ప్రిపుటోను ఈ మధ్యనే అరెస్టు చేశారు. కెన్యా లైంగిక నేరాల చట్టం ప్రకారం.. మైనర్ బాలికతో సెక్సు చేయటం చాలా పెద్ద నేరం. పద్దెనిమిదేళ్ల లోపు వారితో సెక్సు చేస్తే తీవ్రమైన శిక్షలు తప్పవు. తాజాగా నేరారోపణలు ఎదుర్కొంటున్న అతను తప్పు చేసినట్లు తేలితే.. 20 ఏళ్లు జైలుశిక్షను విధించే వీలుంది.
అతడు తప్పు చేశాడా? లేడా? అన్నది పక్కన పెడితే.. తాజా పరిణామాలతో అతను టోక్యో ఒలింపిక్స్ లో పాల్గొనే అవకాశాన్ని కోల్పోయినట్లేనని చెబుతున్నారు. ఒకవేళ.. నేరం రుజువైతే.. అతని జీవితం మొత్తంగా చిక్కుల్లో పడటం ఖాయమని చెప్పక తప్పదు. ఒక రంగంలో అత్యుత్తమ స్థానానికి చేరుకోవటానికి పడిన శ్రమను.. కొన్ని బలహీనతలతో జీవితాన్నే నాశనం చేసుకోవటం ఏమిటో?