Begin typing your search above and press return to search.

పోలింగ్ వేళ... ట్రంప్ కు షాకిచ్చేలా స్టాన్ ఫోర్డు వర్సిటీ రీసెర్చ్

By:  Tupaki Desk   |   1 Nov 2020 12:30 PM GMT
పోలింగ్ వేళ... ట్రంప్ కు షాకిచ్చేలా స్టాన్ ఫోర్డు వర్సిటీ రీసెర్చ్
X
ఎన్నికల వేళ అనుక్షణం విలువైనదే. ముందంతా ఎలా ఉన్నా..కీలకమైన పోలింగ్ కు 48 గంటల ముందు చోటు చేసుకునే పరిణామాలు ఫలితాల ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేలా చేస్తాయి. అందుకే.. పోలింగ్ వస్తుందంటే చాలు.. అప్రమత్తంగా ఉండటమే కాదు.. మైలేజీ వస్తుందంటే దేనికైనా సై అన్నట్లుగా వ్యవహరిస్తుంటాయి రాజకీయ పార్టీలు. మరో రెండురోజుల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి కీలకమైన పోలింగ్ జరగనుంది. భవిష్యత్తు అమెరికా అధ్యక్షుడు ఎవరో తేలనుంది.

ఇలాంటి వేళలో బయటకు వచ్చిన పరిశోధన వివరాలు ట్రంప్ కు భారీ డ్యామేజ్ చేసేలా ఉందని చెప్పాలి. ఇప్పటికే ఎన్నికల రేసులో వెనుకబడినట్లుగా వస్తున్న సర్వేలు రిపబ్లికన్లనను ఊసురుమనిపిస్తుంటే.. మరోవైపు అలాంటి ఉదంతాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ.. ట్రంప్ వర్గీయుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తాజాగా.. ప్రఖ్యాత స్టాన్ ఫోర్డ్ వర్సిటీ వారు చేసిన పరిశోధన ఇప్పుడు సంచలనంగా మారటమే కాదు..ట్రంప్ ప్రచార దాహానికి అమెరికన్లు ఇంత భారీ మూల్యాన్ని చెల్లించుకున్నారా? అన్న షాక్ కు గురవుతున్నారు.

ది ఎఫెక్ట్ ఆఫ్ లార్జ్ గ్రూైప్ మీటింగ్స్ ఆన్ ది స్పైడ్ ఆఫ్ కోవిడ్ 19: ది కేస్ ఆఫ్ ట్రంప్ ర్యాలీస్ అనే అంశంపై పరిశోధన చేపట్టారు. ఎన్నికల నేపథ్యంలో పెద్ద పెద్ద సమూహాల మధ్య నిర్వహించిన ట్రంప్ మాష్టారి సభల కారణంగా కరోనా ప్రభావం ఏమిటన్న దానిపై ఫోకస్ చేశారు. ఈ సందర్భంగావారు షాకింగ్ అంశాల్ని బయటపెట్టారు. ట్రంప్ ఎన్నికల ప్రచారం కారణంగా 30 వేల మంది కోవిడ్ బారిన పడ్డట్లు తేలటమే కాదు.. వీరిలో కనీసం 700 మంది వరకు మరణించి ఉంటారని లెక్క కట్టారు.

జూన్ 20 నుంచి సెప్టెంబరు 22 మధ్య ట్రంప్ నిర్వహించిన 18 ర్యాలీల ప్రభావాన్ని పరిశీలించిన స్టాన్ ఫోర్డు పరిశోధకులు ఈ షాకింగ్ నిజాన్ని బయటపెట్టారు. భారీగా జనం గుంపులు గుంపులుగా చేరటంతో కోవిడ్ వ్యాప్తికి కారణమైందని తేల్చారు. ముఖ్యంగా మాస్కులు లేకుండా.. భౌతిక దూరాన్ని పాటించకుండా ఉండటంతో పరిస్థితి మరి దారుణంగా ఉందన్నారు. ఈ పరిశోధన వివరాలపై డెమొక్రాట్లు స్పందిస్తుననారు. ట్రంప్ తన సొంత మద్దతుదారుల రక్షణను గాలికి వదిలేస్తారంటూ మండిపడుతున్నారు. పోలింగ్ కు రెండురోజులే సమయం ఉన్న వేళలో బయటకు వచ్చిన ఈ సమాచారం పోలింగ్ మీద అంతో ఇంతో ప్రభావాన్ని చూపుతుందని చెబుతున్నారు. కలిసిరాని కాలం అంటే ఇలానే ఉంటుంది మరి. ట్రంప్ మాష్టారికి అర్థమవుతోందా?