Begin typing your search above and press return to search.

మళ్లీ తొక్కిసలాట..

By:  Tupaki Desk   |   20 July 2015 8:44 AM GMT
మళ్లీ తొక్కిసలాట..
X
గోదావరి పుష్కరాల సందర్భంగా జనంతో కిక్కిరిసిపోతున్న రాజమండ్రిలో మళ్లీ చిన్నపాటి తొక్కిసలాట జరిగింది... గోదావరి రైల్వే స్టేషన్‌లో ఆదివారం జరిగిన ఈ తొక్కిసలాటలో ఓ వృద్ధుడు మృతి చెందాడు. మరో ఇద్దరు గాయాలతో బయటపడ్డారు. గోదావరి పుష్కరాల్లో స్నానం చేసేందుకు రాజమండ్రి వచ్చిన యాత్రికులు పెద్ద సంఖ్యలో గోదావరి రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు.

పశ్చిమ గోదావరి జిల్లా దువ్వకు చెందిన ఎం తాతారావు(55) ఆదివారం ఉదయం పుష్కర స్నానం చేయడానికి కుటుంబీకులతో రాజమండ్రి వచ్చారు. తిరిగి తమ స్వగ్రామం వెళ్లేందుకు గోదావరి రైల్వేస్టేషన్‌కు వచ్చారు. అప్పటికే అక్కడ జనం కిక్కిరిసిపోయి ఉన్నారు. స్టేషన్‌లో ప్రయాణీకుల రద్దీ ఎక్కువగా ఉండటంతో రైలు రైలు ఎక్కేందుకు ప్రయాణికులు ఎగబడటంతో తీవ్ర తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటకు గురైన తాతారావు ఊపిరాడక మృతి చెందాడు.

కాగా పుష్కరాల తొలిరోజునే తొక్కిసలాటలో 27మంది మృతిచెందిన విషయం తెలిసిందే... ఆ తరువాత రక్షణ చర్యలు పటిష్ఠం చేయడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరగలేదు. కానీ... ఆదివారం సెలవు కావడంతో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. ఈ నేపథ్యంలోనే గోదావరి రైల్వే స్టేషన్ కిక్కిరిసి తోపులాట జరిగింది.