Begin typing your search above and press return to search.

పార్టీ పెట్టి రాత్రికి రాత్రి అధికారం... రజినీ పై స్టాలిన్ విమర్శలు !

By:  Tupaki Desk   |   24 Dec 2020 6:41 AM GMT
పార్టీ పెట్టి రాత్రికి రాత్రి అధికారం...  రజినీ పై స్టాలిన్ విమర్శలు !
X
తమిళనాడు లో రాజకీయం వేడెక్కుతుంది. వచ్చే ఏడాది అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పటినుండే అన్ని పార్టీల నేతలు కూడా పక్కా ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నారు. అయితే , అనూహ్యంగా రజినీకాంత్ పార్టీ పెట్టబోతున్నా , వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయబోతున్నా అంటూ క్లారిటీ ఇచ్చేశాడు. దీనితో తమిళ రాజకీయ సమీకరణాలు అన్ని కూడా ఒక్కసారిగా మారిపోయాయి. ఇదిలా ఉంటే రజినీకాంత్ త్వరలో పార్టీ పెట్టబోతున్నా డిసెంబర్ 31 న కీలక ప్రకటన ఉంటుంది అని చెప్పినప్పటికీ , ఆ తర్వాత మళ్లీ సినిమా షూటింగ్ లో బిజీ అయ్యారు.

ప్రస్తుతం సెట్స్ పై ఉన్న సినిమాని త్వరగా ఫినిష్ చేసి , ఆ తర్వాత పూర్తిగా రాజకీయాల్లో కొనసాగాలని అనుకున్నారు. కానీ తానొకటి తలిస్తే దేవుడు మరొకటి తలచినట్టు ఆ సినిమా యూనిట్ లో కొందరికి కరోనా నిర్దారణ కావడంతో ఆ సినిమా షూటింగ్ ఆగిపోయింది. దీనితో ర‌జ‌నీకాంత్ ఎప్పుడు షూటింగును పూర్తి చేసి, త‌న పార్టీని ఎన్నిక‌ల‌కు స‌మాయ‌త్తం చేస్తారో కానీ, ఈ షూటింగుపై త‌మిళ‌నాడు రాజ‌కీయ నేత‌లు అప్పుడే సెటైర్లు మొద‌లుపెట్టారు. కనీసం ఎన్నికలకి ఐదునెలల సమయం కూడా లేదు.

ఓ వైపు కాంగ్రెస్ నేతలు .. పార్టీ పెట్టి సినిమా షూటింగ్ కి వెళ్లారు అని విమర్శలకి దిగితే ,డీఎంకే అధినేత స్టాలిన్ తనదైన విమర్శలతో రజినీ పై రెచ్చిపోతున్నారు. రజినీ రాజకీయాల్లోకి వచ్చినా కూడా తమవాడు కాదని నిర్దారించుకున్న స్టాలిన్ , రజినీ పై హాట్ కామెంట్స్ చేస్తూ పొలిటికల్ హిట్ పెంచుతున్నాడు. గ‌తంలో అన్నాదురై ఎన్నో యేళ్లు శ్ర‌మించి రాజ‌కీయ పార్టీని అభివృద్ధి చేశార‌ని, ఆయ‌న‌కే అధికారాన్ని అందుకోవ‌డానికి చాలా యేళ్లు ప‌ట్టాయ‌ని , అయితే ఇప్పుడు పార్టీ పెట్టిన 24 గంట‌ల్లోనే అధికారాన్ని సొంతం చేసుకోవాల‌ని కొంత‌మంది క‌ల‌లు కంటున్నార‌ని , పార్టీ పెట్టి రాత్రికి రాత్రి అధికారాన్ని పొందాల‌ని చూస్తున్నారంటూ స్టాలిన్ రజినీ పేరు తీయకుండా పరోక్షంగా విమర్శలకి దిగారు. ఏదేమైనా ఎన్నిక‌ల‌కు కొన్ని నెల‌ల ముందు కూడా సినిమాల‌ను వ‌దులుకోకుండా, పోలింగ్ కే ఐదు నెల‌ల స‌మ‌యం ఉన్న నేప‌థ్యంలో ఇంకా సినిమా షూటింగ్ అంటూ వ్రేలాడుతుండటం తో ప్రత్యర్దులకి మంచి అవకాశం ఇచ్చినట్టు అయింది. ఇదిలా ఉంటే కనీసం ఎన్నికల ముందు ఐదారు నెలలైనా కూడా ప్రజలమధ్య లేకపోతె , ఆ పార్టీని ఎలా ప్రజల్లోకి తీసుకుపోతాడు , ఎలా వారి నమ్మకాన్ని పొంది ఓట్లు కొల్లగొడతాడో