Begin typing your search above and press return to search.
అసెంబ్లీ సమావేశాలతో గులాబీ నేతలకు కొత్త పరేషాన్
By: Tupaki Desk | 7 Sep 2020 5:45 AM GMTవిచిత్రమైన పరిస్థితుల్లో ఈ రోజు నుంచి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సాగుతున్నాయని చెప్పక తప్పదు. ఇప్పటివకు మరెప్పుడు లేని రీతిలో ఈ సమావేశాలు జరుగుతాయని చెప్పక తప్పదు. రాజకీయ అంశాల్ని పక్కన పెడితే.. మిగిలిన విషయాలన్ని సభ్యులందరికి సరికొత్త అనుభవాన్ని ఇవ్వటం ఖాయం. కరోనా వేళ.. నిర్వహిస్తున్న అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఉండాల్సిన జోష్ తక్కువగా ఉండే అవకాశమే ఎక్కువ అంటున్నారు.
సాధారణంగా అసెంబ్లీ సమావేశాల నిర్వహణ సందర్భంగా ఆ హడావుడి.. జోష్ వేరుగా ఉంటుంది. అధికార పక్షాన్ని నిలదీయాలన్న ఉత్సాహం ప్రతిపక్షాల్లో ఉంటే.. విపక్షాల్ని కంట్రోల్ చేయాలన్న పట్టుదల అధికారపక్ష నేతల్లో కనిపిస్తూ ఉంటుంది. తాజా సమావేశాలు మాత్రం ఈ రెండింటికి మించి.. వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా అందరిలోనూ కరోనా గుబులు.. టెన్షన్ తోనే సమావేశానికి హాజరవుతారని చెబుతున్నారు.
లోలోన భయాందోళనలు.. వాటిని కవర్ చేస్తూ సమావేశాలకు హాజరు కావాల్సి ఉంటుందని చెబుతున్నారు. అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యుల్లో అత్యధికులు టీఆర్ఎస్ నేతలు. అందుకు తగ్గట్లే.. ఇప్పటివరకు కరోనా బారిన పడిన వారిలోనూ టీఆర్ఎస్ నేతలే ఎక్కువగా ఉండటాన్ని మర్చిపోకూడదు. సమావేశాల సందర్భంగా ఇప్పటికే పాజిటివ్ వచ్చి.. నెగిటివ్ అయిన వారిలో ధీమా కనిపిస్తే.. వయసు మీద పడిన వారు.. ఇప్పటికే పలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే వారికి మాత్రం పరేషాన్ లో ఉన్నట్లు తెలుస్తోంది.
అలా అని.. అసెంబ్లీ సమావేశాల్ని నిర్వహించొద్దని చెప్పలేని పరిస్థితి. అలా అని ఇంటికే పరిమితం కావటం సరికాదు. దీంతో.. అసెంబ్లీ సమావేశాల హాజరు సందర్భంగా కొత్త పరేషాన్ తెలంగాన ప్రజాప్రతినిదుల్లో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. ఏమైనా.. రోటీన్ కు భిన్నమైనవి ఈసారి తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలుగా చరిత్రలో నిలిచిపోనున్నట్లుగా చెప్పక తప్పదు.