Begin typing your search above and press return to search.

గాంధీలో కలకలం..ఒకరి డెడ్ బాడీని ఇంకొకరికి ఇచ్చేశారట!

By:  Tupaki Desk   |   11 Jun 2020 11:50 AM GMT
గాంధీలో కలకలం..ఒకరి డెడ్ బాడీని ఇంకొకరికి ఇచ్చేశారట!
X
తెలంగాణలో ఏకైక వైరస్ హాస్పిటల్ గా ఉన్న గాంధీ హాస్పిటల్ లో ప్రతి రోజు ఎదో ఒక కలకలం ఏర్పడుతుంది. తాజాగా గాంధీ ఆస్పత్రిలో వైరస్ మృతుడి శవం మాయమైంది. మెహదీపట్నానికి చెందిన రషీద్ కోవిడ్ బారిన పడటంతో జూన్ 9న హాస్పిటల్లో చేరగా.. బుధవారం తెల్లవారుజామున ప్రాణాలు కోల్పోయాడు. రషీద్ మృతి విషయాన్ని నిన్న ఉదయం బంధువులకు అధికారులు సమాచారం ఇచ్చారు. అయితే మృతదేహం కోసం నిన్న సాయంత్రం బంధువులు ఆస్పత్రికి రాగా మార్చురీలో మృతదేహం లేదని, దీనితో
దీనితో బంధువులు ఈ విషయం పై పోలీసులను ఆశ్రయించార అని ప్రసారమాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది.

దీనితో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు డెడ్ బాడీ ఎలా మిస్సయిందనే విషయమై ఆరా తీశారని, పోలిసుల విచారణలో అసలు విషయం బయటపడిందని, రషీద్ మృతదేహాన్ని పొరబాటున , ఇంకో శవం బదులుగా వేరే వాళ్లకు ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారని ప్రసారమాధ్యమాల్లో ప్రచారం జరుగుతుంది. అలాగే, వాళ్లు బుధవారమే అంత్యక్రియలు నిర్వహించారని తేలిందని, రషీద్ మృతదేహం కోసం వెతుకుతున్న ఆయన సోదరుడికి గాంధీ హాస్పిటల్ వర్గాలు ఈ సమాచారం అందించారని ప్రసారమాధ్యమాల్లో ప్రచారం జరుగుతుంది.

అయితే, గాంధీలో వైరస్ తో చనిపోయిన పేషెంట్ డెడ్ బాడీ మిస్ కావడం ఇదే తొలిసారి కాదు. ఇటీవలే ఒకరి మృతదేహం బదులు మరొకరి డెడ్ బాడీని అప్పగించడంతో.. అంత్యక్రియలు చేసే ముందు గమనించిన బంధువులు గాంధీ హాస్పిటల్ వర్గాలకు సమాచారం అందించాయి. అంతకుముందు హయత్‌నగర్‌కు చెందిన ఓ వ్యక్తి గాంధీ హాస్పిటల్‌లో కరోనాతో చనిపోగా.. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న కుటుంబీకులకు సమాచారం ఇవ్వకుండానే అంత్యక్రియలు పూర్తి చేశారు. ఈ విషయమై మృతుడి భార్య హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.