Begin typing your search above and press return to search.
ఏపీలో పదో తరగతి పరీక్షల పై క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం !
By: Tupaki Desk | 10 Jun 2020 10:50 AM GMTదేశవ్యాప్తంగా రోజురోజుకి పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. అలాగే రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా వైరస్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో పదో తరగతి పరీక్షలు రద్దు చేస్తూ కేసీఆర్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో... ఏపీలో పరీక్షలు కొనసాగుతాయా లేదా అన్న సస్పెన్స్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ క్లారిటీ ఇచ్చారు.
తెలంగాణలో రద్దు చేసారు కాబట్టి ఏపీలో కూడా రద్దు చేస్తారనే అంతా భావించారు. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం పరీక్షల నిర్వహణకే మొగ్గు చూపింది. ఏపీలో షెడ్యూల్ ప్రకారమే పదో తరగతి పరీక్షలు జరుగుతాయని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. షెడ్యూల్ ప్రకారం జులై 10వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు జరుగుతాయని మంత్రి తెలిపారు. 11 పేపర్ల స్థానంలో 6 పేపర్లకు పరీక్ష జరుగుతుందని చెప్పారు. అసత్య ప్రచారాలతో విద్యార్థులను గందరగోళానికి గురి చేయొద్దని అన్నారు.
వైరస్ కారణంగా తెలంగాణలో పదో తరగతి పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసిన నేపథ్యంలో... ఏపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అయితే తమ రాష్ట్రంలో మాత్రం పదో తరగతి పరీక్షలు కొనసాగుతాయని ఏపీ సర్కార్ స్పష్టం చేసింది. వైరస్ వ్యాప్తి పెరుగుతుండటంతో తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలు పదో తరగతి పరీక్షలను రద్దు చేసి.. విద్యార్ధులను ఇంటర్నల్ మార్క్స్ ఆధారంగా పైతరగతులకు ప్రమోట్ చేశారు.