Begin typing your search above and press return to search.

పార్క్ హయత్ హోటల్ కు వెళ్లడంపై స్పందించిన సుజనా

By:  Tupaki Desk   |   24 Jun 2020 6:00 AM GMT
పార్క్ హయత్ హోటల్ కు వెళ్లడంపై స్పందించిన సుజనా
X
ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తో బీజేపీ ఎంపీ సుజనా చౌదరి, మరో బీజేపీ నేత కామినేని శ్రీనివాస్ భేటి రాజకీయ దుమారం రేపింది. ఏపీలో చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. మంగళవారం ఉదయం వీరంతా హైదరాబాద్ లోని పార్క్ హయాత్ హోటల్ లో కలుసుకున్న వీడియో ఫుటేజ్ వెలుగులోకి రావడం, మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ జూన్ 13 న మాజీ కేంద్ర మంత్రి, బిజెపి ఎంపి సుజనా చౌదరి, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ తో సమావేశమైనట్లు వీడియోల్లో కనిపించింది.

దీనిపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వేసిన ఆరోపణలపై సుజనా చౌదరి తాజాగా ఖండించారు. పార్క్ హయత్ హోటల్‌లో వారితో రహస్య సమావేశం జరిగిందన్న మీడియా వార్తలను కూడా ఖండించారు. కరోనా వైరస్ తీవ్రత ప్రారంభమై లాక్డౌన్ ప్రకటించినప్పటి నుంచి పార్క్ హయత్ హోటల్ నుంచి అధికారిక, వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నానని, తాను వివిధ వర్గాల ప్రజలను, వివిధ రాజకీయ పార్టీల నాయకులను కలుస్తున్నానని సుజనా చెప్పారు.

"నా సమావేశాలు రహస్యంగా లేవు. నా కార్యకలాపాలలో రహస్యం అవసరం లేదు" అని సుజనా చెప్పాడు. కాబట్టి, జూన్ 13 న, కామినేని కూడా రాష్ట్రంలో బిజెపి కార్యకలాపాలపై చర్చించడానికి నిర్ణీత సమయంలో కలిశానని వివరించాడు. కామినేనితో సమావేశం తరువాత, అతను వెళ్లిపోయాడని.. తదనంతరం నిమ్మగడ్డ రమేష్ కుమార్ నన్ను కలవడానికి వచ్చాడని.. ఒక కప్పు కాఫీ తాగి కొంత సమయం గడిపాము, ”అని సుజనా చెప్పాడు. మా భేటి అధికారిక లేదా రాజకీయ అంశాలతో సంబంధం లేనిదని సుజనా స్పష్టం చేశారు. "మా కుటుంబాలు సన్నిహతమైనవి. చాలాకాలంగా ఒకరినొకరు తెలుసు. మా పర్సనల్ భేటి ఇదీ ”అని అన్నారు.

ముగ్గురు కలిసి కలుసుకున్నారని సిసిటివి ఫుటేజ్ ఆధారంగా, మీడియా - రాజకీయ వర్గాలలోని కొన్ని స్వార్థ ప్రయోజనాలను చూపించడానికి చేసిన ప్రయత్నాలను సుజనా చౌదరి ఖండించారు.