Begin typing your search above and press return to search.

బీజేపీలో చేరాక అలాంటి మాటలే వస్తాయి సుజనా

By:  Tupaki Desk   |   3 April 2021 5:30 AM GMT
బీజేపీలో చేరాక అలాంటి మాటలే వస్తాయి సుజనా
X
వస్తుందో.. రాదో? అన్న ప్రశ్నల్ని పక్కన పెట్టేసి.. ఆశయ సాధన కోసం బలంగా ప్రయత్నిస్తే.. సాకారం కానిదే ఏమీ ఉండదన్న విషయాన్ని నిరూపించింది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు. కలలో కూడా ఊహించని విధంగా.. తెలంగాణ ప్రజల కలలకు నిదర్శనంగా ప్రత్యేక రాష్ట్రమే ఏర్పడింది. ఇదొక్క ఉదాహరణ చాలు..పోరాడాలే కానీ సాధించలేనిది ఏమీ ఉండదని. అదేం దరిద్రమో కానీ.. ఏపీకి సుజనా లాంటినేతలు ఫుష్కలంగా ఉండటంతో.. ఆ రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన ప్రత్యేక హోదా రాని పరిస్థితి.

సరే.. హోదా రాదనే అనుకుందాం. అందుకు ఎన్ని రకాలుగా పోరాటాలు చేయాలో అన్ని చేయాలే తప్పించి.. సింఫుల్ గా తీసేయటం.. ఏం చేసినా రాదంతే అంటూ తేల్చి చెప్పటం వాటి వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఆ మధ్యన జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో టీడీపీ దారుణ ఓటమి తర్వాత.. బాబుకు నీడలా వ్యవహరించే ఇద్దరిలో ఒకరైన సుజనా చౌదరి బీజేపీలోకి జంప్ కావటం తెలిసిందే. ప్రత్యేక హోదా కోసం సుజనా రాజ్యసభలో ఎంతలా ప్రయత్నించారో తెలిసిందే.

అలాంటి ఆయనే.. హోదా విషయంలో తెల్ల జెండా ఎగరేయటం గమనార్హం. హోదా పేరుతో కొన్నిపార్టీలు రాజకీయం చేస్తున్నాయంటూ రాష్ట్ర ప్రయోజనాల్ని వదిలేసి.. కేవలం తన రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా వ్యాఖ్యలు చేయటం గమనార్హం. తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి విజయం సాధిస్తే.. తిరుపతి డెవలప్ అవుతుందన్నారు.

ఏపీ సీఎం జగన్.. టీడీపీ అధినేత చంద్రబాబుతో సహా ఎవరు ప్రధానమంత్రి అయినా.. ఏపీకి మాత్రంప్రత్యేక హోదాను తెచ్చుకోలేరని తేల్చారు. పుదుచ్చేరికి ప్రత్యేక హోదా ఇచ్చారంటూ బీజేపీపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ఎందుకంటే.. రాష్ట్రాలకు.. కేంద్రపాలిత ప్రాంతాలకు హోదా కుదరదని.. ఆర్థిక సంఘాలు చెప్పిన వైనాన్ని గుర్తుచేశారు. ప్రత్యేక హోదా అంశాన్ని వైసీపీ.. టీడీపీలు తమ రాజకీయ అవసరాల కోసం హోదా పేరునను వాడుకుంటున్నట్లుగా మండిపడ్డారు. సుజనా లాంటి జాతిరత్నాలు ఏపీకి ఉంటే.. హోదా ఎందుకు వస్తుంది చెప్పండి?