Begin typing your search above and press return to search.
మంజ్రేకర్‌ను ఎవరికైనా చూపించండి.. ఆయన వాగేదంతా చెత్త.. మాజీ క్రికెటర్ శ్రీకాంత్ చురకలు
By: Tupaki Desk | 29 Oct 2020 3:45 AM GMTఆస్ట్రేలియా టూర్‌కు జట్టు ఎంపిక తర్వతా బీసీసీఐపై తీవ్ర విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన మాజీ కామెంటర్ సంజయ్ మంజ్రేకర్కూడా బీసీసీఐపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించాడు. ఆస్ట్రేలియాతో భారత్ మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుంది. సునీల్ జోషీ ఆధ్వర్యంలోని కొత్త సెలెక్షన్ కమిటీ వర్చువల్‌గా సమావేశమై.. ఈ సిరీస్‌ల కోసం వేర్వేరుగా జట్లను ఎంపిక చేసింది. ఈ జట్ల ఎంపికపై ముంజ్రేకర్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. కేఎల్ రాహుల్‌ను టెస్ట్‌ల్లోకి ఎంపికచేయడాన్ని ఆయన తప్పుబట్టాడు.
ఐపీఎల్ ప్రదర్శనను చూసి టెస్ట్ జట్టులోకి తీసుకోవడం సబబు కాదని, రంజీ ఆటగాళ్లకు అన్యాయం చేసినట్టేనని సెలెక్టర్లను విమర్శించాడు. రవీంద్ర జడేజాను టెస్ట్‌ల్లోకి తీసుకోవడం కూడా సరికాదని మంజ్రేకర్ మండిపడ్డాడు. అయితే మంజ్రేకర్ వ్యాఖ్యలపై మాజీ క్రికెటర్ శ్రీకాంత్ స్పందించాడు. ‘ మాజీ కామెంటర్ సంజయ్ మంజ్రేకర్ కు మతి భ్రమించింది. అతడి మాటలను ఎవరూ పట్టించుకోవద్దు. నిత్యం వివాదాలను క్రియేట్ చేయడమే పనిగా పెట్టుకున్నాడు. కేఎల్ రాహుల్ ను టెస్ట్‌ల్లో ఎంపిక చేయడం సరైన నిర్ణయమే. రాహుల్ గత రికార్డులు చూడమనండి. టెస్టుల్లో అద్భుతంగా రాణించాడు. ముంజ్రేకర్ వ్యాఖ్యలతో నేను ఏ మాత్రం ఏకీభవించను’ అంటూ శ్రీకాంత్ ఫైర్ అయ్యారు.
టీ20 జట్టులోకి యువ స్పిన్నర్ అక్షర్ పటేల్ ను కాదని రవీంద్ర జడేజా ను ఎంపిక చేయడం కూడా బాలేదని సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు. ఓ అభిమాని 'టీ20లకు రవీంద్ర జడేజా పనికిరాడు. అతని స్థానంలో అక్షర్ పటేల్ తీసుకోవాల్సింది. మీరేమంటారు?'అని మంజ్రేకర్ ను ట్విటర్ వేదికగా ప్రశ్నించాడు. దీనికి మంజ్రేకర్ సదరు అభిమాని వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నానని తెలిపాడు. జడేజా కు బదులు, అక్షర్ పటేల్ ను తీసుకోవాల్సిందని తన మనసు లోని మాటను చెప్పకనే చెప్పాడు.