Begin typing your search above and press return to search.

శ్రీశైలం క్షుద్రపూజల్లో నిజమేంటి

By:  Tupaki Desk   |   30 Dec 2018 4:19 PM GMT
శ్రీశైలం క్షుద్రపూజల్లో నిజమేంటి
X
శ్రీశైలంలో క్షుద్రపూజల వివాదం మరో మలుపు తిరిగింది. తాంత్రిక పూజలు చేసినట్లుగా అంగీకరించినట్లు వార్తలొచ్చినప్పటికీ వేద పండితుడు గంటి రాధాకృష్ణ శర్మ దాన్ని తీవ్రంగా ఖండించడంతో పాటు తనలో బలవంతంగా అలా రాయించుకుని సంతకాలు చేయించుకున్నారని ఆరోపించారు. తన ఇంట్లో చండీహోమం చేశామే కానీ తాంత్రిక పూజలేమీ చేయలేదన్నారు.

తాను శ్రీశైలం దేవస్థానం పరిధిలో క్షుద్ర, తాంత్రిక పూజలు చేశానని ఒప్పకున్నట్లు మీడియాలో వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. బ్రాహణ సంఘం నేతలు బలవంతంగా వివరణ లేఖపై సంతకం పెట్టించారని రాధాకృష్ణ ఆరోపించారు. క్షుద్ర పూజలు చేశానంటూ తనపై అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. తాను ఏ తప్పూ చేయలేదని చెప్పడానికే మీడియా ముందుకొచ్చానని రాధాకృష్ణ తెలిపారు.

కాగా శ్రీశైలం ఆలయం వేద పండితుడు రాధాకృష్ణ శర్మ తన ఇంటి వద్ద తాంత్రిక పూజలు చేశారన్న ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయనను విధుల నుంచి తప్పించారు. ఆయన హైకోర్టు - హెచ్చార్సీని ఆశ్రయించారు. ప్రభుత్వం కూడా విచారణ కమిటీ నియమించింది. ఈ నేపథ్యంలో తాంత్రిక పూజలు చేసిన మాట వాస్తవమేనని అంగీకరించినట్లు వార్తలు వెలుగుచూశాయి. కానీ... రాధాకృష్ణ ఇప్పుడు మరో వెర్షన్ వినిపిస్తున్నారు. తనతో బలవంతంగా లేఖ రాయించి సంతకాలు చేయించారంటూ ఆరోపించారు.