Begin typing your search above and press return to search.
ఎస్ ఈగారి భార్యా మజాకానా? ఏకంగా శ్రీశైలం గేట్లను ఎత్తించేశారు
By: Tupaki Desk | 10 Sep 2019 5:03 AM GMTచేతిలో పవర్ ఉండేది దేనికి? ప్రదర్శించుకోవటానికే అన్నట్లుగా వ్యవహరించే ధోరణి కొందరిలో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తూ ఉంటుంది. తాజాగా అలాంటి తీరునే ప్రదర్శించి.. ముక్కున వేలేసుకునేలా చేశారు ఏపీ జలవనరుల శాఖ ఇన్ చార్జి సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్రీనివాసరెడ్డి.
ఎగువన భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా జూరాల.. సుంకేసుల రిజర్వాయర్ల నుంచి శ్రీశైలం ప్రాజెక్టులోకి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. మొన్నామధ్య వరుస వర్షాలతో గేట్లను ఎత్తినా.. ఇటీవల ఇన్ ఫ్లో తగ్గటంతో ఎత్తిన గేట్లను దించేశారు.
తాజాగా ఎగువ నుంచి వస్తున్న వరద నీటికి అనుగుణంగా దిగువకు నీటిని విడుదల చేసే క్రమంలో తాజాగా శ్రీశైలం డ్యామ్ గేట్లలో రెండింటిని ఎత్తేశారు. సాధారణంగా గేట్లను ఎత్తాలంటే అందుకు సంబంధిత అధికారులతో గేట్లను ఎత్తించాలి. అందుకు భిన్నంగా ఎస్ ఈ శ్రీనివాసరెడ్డి తన సతీమణితో గేట్లను ఎత్తించటం చర్చనీయాంశంగా మారింది. ఈ తీరు సరైనది కాదని పలువురు తప్పు పడుతున్నారు. ఎంత ఉన్నతాధికారి అయితే మాత్రం ఈ రీతిలో ఇష్టారాజ్యంగా వ్యవహరించటం సరైనది కాదంటున్నారు.