Begin typing your search above and press return to search.
మనోడు కూఛిభొట్లను చంపినోడికి ఉరి!
By: Tupaki Desk | 10 Jun 2017 6:23 PM GMTకొద్దిరోజుల క్రితం యావత్ దేశాన్ని కదిలించిన కూఛిబొట్ల శ్రీనివాస్ ఉదంతం గుర్తుందా? అమెరికాలో జాత్యాంహకారానికి పరాకాష్ఠగా వ్యవహరించి.. అడ్డగోలుగా మనోడిని కాల్చి చంపిన నిందితుడికి తీవ్రమైన శిక్ష వేసేందుకు అక్కడి కోర్టు సిద్ధమవుతుందా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
స్నేహితుడితో కలిసి పబ్బుకు వెళ్లిన తెలుగు యువకుడు శ్రీనివాస్ కూచిభొట్లను అత్యంత దారుణంగా కాల్చి చంపిన ఘటన తెలిసిందే. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ వ్యాప్తంగా జాత్యాంహకారంతో అక్కడి కొందరు విపరీత ప్రవర్తనతో వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ కారణంగా పలు దారుణాలు అమెరికాలో చోటు చేసుకున్నాయి.
ఇందులో భాగంగా శ్రీనివాస్ కూఛిబొట్లను.. నీ దేశానికి వెళ్లిపో అంటూ బిగ్గరగా అరుస్తూ ఆడమ్ పురింటన్ అనే ఉన్మాది విచక్షణారహితంగా కాల్పులు జరపటం.. దీనికి శ్రీనివాస్ అక్కడికక్కడే కుప్పకూలిపోగా.. మరో ప్రవాసుడు ఆలోక్ మాదసాని గాయపడిన సంగతి తెలిసిందే.
ఈ హత్యకు సంబంధించిన కేసు విచారణ తుదిదశకు చేరుకున్నట్లుగా చెబుతున్నారు. ఫిబ్రవరి 22న జరిగిన హత్యపై కోర్టులో విచారణ జరుగుతోంది. కాల్పులు జరిపిన ఆడమ్ పై జాత్యాహంకార దాడికి పాల్పడిన అభియోగాన్ని నమోదు చేశారు. ఈ దారుణ హత్యకు కారణమైన నిందితుడికి ఉరిశిక్ష విధించే అవకాశం ఎక్కువగా ఉందన్న మాట వినిపిస్తోంది. విచారణ తుదిదశకు చేరుకుందని.. త్వరలోనే నిందితుడికి ఉరిశిక్షను విధించే అవకాశం ఉందన్న మాటను అక్కడి న్యాయవర్గాలు చెబుతున్నాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/