Begin typing your search above and press return to search.
కిలో బియ్యం రూ. 200.. చికెన్ కిలో రూ. వెయ్యి..!
By: Tupaki Desk | 21 March 2022 3:30 AM GMTకోవిడ్ దెబ్బకు కుదేలైన ఆర్థిక వ్యవస్థల్లో శ్రీలంక ఒకటి. కొవిడ్ విజృంభణ తరువాత ఈ దేశం అన్ని దేశాలు మాదిరిగానే లాక్ డౌన్ లోకి వెళ్ళిపోయింది. ఇదే శ్రీలంకలో పరిస్థితి అత్యంత దారుణంగా దిగజారేందుకు కారణం అయ్యాయి. కోవిడ్ సంక్షోభం కారణంగా ఆ దేశంలో ఆర్థిక-ఆరోగ్య సంక్షోభంలో పడ్డాయి. అన్ని రంగాలు కూడా అప్పుల్లోకి కూరుకుపోయాయి. ప్రస్తుతం దివాలా తీసే స్థితిలో ఉందని జాతీయ మీడియా ల్లో కథనాలు ఓ రేంజ్ లో వస్తున్నాయి. అయితే వీటన్నింటికీ ఉండే ఒకే కారణం కొవిడ్. వైరస్ ప్రభావం వల్ల శ్రీలంక నిండా మునిగిందని చెబుతున్నారు నిపుణులు.
ఎందుకంటే దేశంలో ముఖ్యమైన పరిశ్రమలు అయిన తేయాకు, వస్త్రాలు, పర్యాటకం లాంటివి కోలుకోలేని విధంగా దెబ్బ తిన్నాయి. దీంతో శ్రీలంక ఆదాయం కు భారీ గండి పడింది. ఎగుమతులు లేక విదేశీ మారక నిల్వలు అడుగంటిపోయాయి. ఈ క్రమంలోనే శ్రీలంక లోని కేంద్ర బ్యాంకు ఓ ఐడియా వేసింది. అమెరికన్ డాలర్ల సరిపోయే విదేశీ మారక రేటు ను తెరపైకి తీసుకుని వచ్చింది. దీంతో దేశంలో ఎన్నడూ లేని విధంగా డాలర్ రేటు పెరిగిపోయింది. వీరు అనుకున్నది ఒకటి అయితే అది ఇంకోటి జరిగింది.
దీంతో శ్రీలంకలో వస్తువుల ధరలు బాగా పెగిగాయి. కేవలం వస్తువుల ధరలు మాత్రమే కాకుండా ఇతర నిత్యావసర ధరలు కూడా భారీ స్థాయిలో పెరిగాయని స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలో భారీ గా వంట గ్యాస్ కొరత ఏర్పడింది. ఒకప్పుడు టూరిజం ఆపరేషన్స్ తో ఎక్కువ ఆదాయం ఆర్జించిన దేశంలో ఇప్పుడు ఏకంగా గ్యాస్ లేక రెస్టారెంట్లు మూసేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడినట్లు అధికారులు చెబుతున్నారు.
మరో వైపు నిత్యావసర వస్తువులు భారీగా పెరిగిన సరే... సమయానికి అన్నీ అందక ప్రజలు వాటి కోసం క్యూ లు కడుతున్నారని ఆ దేశ మీడియా ఇప్పటికే చాలాసార్లు వాస్తవ పరిస్థితులను కళ్లకు కట్టినట్లు చూపించింది. కనీసం పెట్రోల్, డీజిల్ లాంటివి కావాలి అన్నా కానీ పెద్ద పెద్ద క్యూల్లో నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది. సుమారు 50 ఏళ్ల క్రితం కింద వచ్చిన కరువు కంటే ఇప్పుడు ఉండే పరిస్థితులు చాలా దారుణంగా తయారు అయ్యాయని చెప్తున్నారు.
పర్యాటకంగా ఒక వెలుగు వెలిగిన శ్రీలంక గా ఇప్పుడు అలాంటి ఆపరేషన్స్ లేవు. అందుకే అక్కడ ఉన్న చాలా రెస్టారెంట్లు మూత పడ్డాయి. గ్యాస్ సమస్య కూడా వీరిని చాలా వేధిస్తుంది. దీంతో చాలా రెస్టారెంట్లు కర్రల పొయ్యి పై వంట చేస్తున్నారు అని తెలుస్తోంది. సుమారు 90 శాతం రెస్టారెంట్లు అన్నీ కూడా మూత పడినట్లు అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం కొన్ని చిన్న రెస్టారెంట్లు మాత్రమే నడుస్తున్నాయని చెప్తున్నారు. గ్యాస్ కొనుక్కోవాలి అంటే ముందుగా ప్రభుత్వం దానిని దిగుమతి చేసుకోవాలి.
ఇలా దిగుమతి చేసుకోవాలి అంటే వారి దగ్గర సరిపడా అమెరిక్ డాలర్లు లేవు. ఇదిలా ఉంటే శ్రీలంకలో ప్రస్తుతం ఉన్న మరో సంక్షోభం ఏంటి అంటే అది ఇంధనం. దీని కారణంగా దేశంలో చాలా మంది గంటల తరబడి ఫిల్లింగ్ స్టేషన్ల వద్ద కనిపిస్తున్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ లాంటి సేవలు ప్రస్తుతం శ్రీలంకలో చాలా తక్కువ ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. దీంతో ఇంధనం దొరుకుతుందా లేదా అనేది చెప్పలేకపోతున్నామని అంటున్నారు. భవిష్యత్తులో మరింత దారుణం గా పరిస్థితులు ఉండవచ్చు అని అంటున్నారు.
ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు నేతలు సరైన నిర్ణయాలు తీసుకోలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భవిష్యుత్తును దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోకపోవడం వల్లే ఇలాంటి ఇబ్బందులు ఎదురువుతున్నాయని అంటున్నారు ప్రజలు. కరోనా వేళ ఖజానా ఖాళీ అయిన సమయంలో ఇతర దేశాల నుంచి అధిక వడ్డీలకు అప్పులు చేసి దివాళా స్థాయికి తీసుకుని వచ్చారని అంటున్నారు.
ప్రస్తుతం నిత్యవసర ధరలు ఇలా ఉన్నాయి.... బియ్యం 2021లో రూ. 115 ఉండే ప్రస్తుతం రూ. 220 ఉంది. గోధుమ పిండి ప్రస్తుతం రూ. 220 వరకు పలుకుతుంది. చికెన్ వెయ్యి రూపాయిలు, గుడ్డు నలభై రూపాయిలు, ఉల్లి పాయలు కిలో 250 రూపాయిలుగా ఉన్నాయి.