Begin typing your search above and press return to search.
ఒక వ్యక్తి ద్వారా వేల మందికి వైరస్: శ్రీలంకలో కల్లోలానికి అతడే కారణం
By: Tupaki Desk | 16 July 2020 4:30 PM GMTవైరస్ బారిన ప్రస్తుతం అమెరికాతో భారతదేశం పోటీ పడుతోంది. భారత్‌లో కూడా భారీగా కేసులు నమోదవుతున్నాయి. భారత్‌లో పరిస్థితి అలా ఉంటే పొరుగున ఉన్న ద్వీపకల్ప దేశం శ్రీలంకలో కూడా పరిస్థితి అలాగే ఉంది. ఆ దేశంలో కూడా తీవ్రంగా వైరస్ వ్యాపిస్తోంది. అయితే ఆ దేశంలో ఒక వ్యక్తి ద్వారా దేశమంతటా వైరస్ తీవ్రస్థాయిలో వ్యాప్తి చెందిందని ఆ దేశం గుర్తించింది. వైరస్ వ్యాప్తి క్రమాన్ని అధ్యయనం చేసిన ఆ దేశ ప్రభుత్వం అత్యధిక కేసులకు ఓ వ్యక్తినే కారణమంటూ సంచలన ప్రకటన చేసింది. ప్రస్తుతం ఆ దేశంలో 2,600కు పైగా కేసులు ఉన్నాయి. వాటిలో సగం మందికి ఓ వ్యక్తి ద్వారానే వైరస్ సోకినట్లు అధికారులు గుర్తించారు.
పేషెంట్ 206 అని ప్రస్తావిస్తూ, ఆ వ్యక్తికి ఉన్న డ్రగ్ అలవాటు వలనే మూడు ప్రాంతాలను క్లస్టర్‌లుగా ప్రకటించాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలను ఆ వ్యక్తి ఖండించడం గమనార్హం. అతడే ప్రసాద్ దినేశ్ (33). తనను అన్యాయంగా.. తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని వాపోయాడు. ఇంతమందికి వైరస్ సోకడానికి తాను కారణంగా చెప్పడాన్ని అతడు ఖండించారు. నెల రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందిన అతడు ఇటీవల ఇంటికి చేరుకున్నాడు. ఈ సమయంలో ప్రభుత్వం పేషెంట్ 206 అని చెప్పి తనపై ఆరోపణలు చేయడంపై ఆవేదన వ్యక్తం చేశాడు.
వాస్తవంగా దినేశ్ గత నెలలో ఓ దొంగతనం కేసులో పోలీసులకు చిక్కాడు. ఈ సమయంలో అతడికి జ్వరం ఉన్నట్లు గుర్తించిన పరీక్షలు చేయగా పాజిటివ్ తేలింది. ఈ సందర్భంగా అతడి ద్వారా దాదాపు 900 మందికి వైరస్ సోకినట్లు అధికారులు గుర్తించారు. అందుకే పేషెంట్ 206గా పిలుస్తూ అతడే కారణమంటూ ప్రభుత్వం ప్రకటించింది.