Begin typing your search above and press return to search.

మూడు ముక్కలుగా శ్రీకాకుళం జిల్లా: లేకుంటే ఉద్యమమే

By:  Tupaki Desk   |   27 Jun 2020 2:20 PM IST
మూడు ముక్కలుగా శ్రీకాకుళం జిల్లా: లేకుంటే ఉద్యమమే
X
జిల్లాల విభజనపై ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే తీవ్ర చర్చ మొదలైంది. త్వరలోనే జిల్లాల విభజన ఒక కొలిక్కి వచ్చేలా ఉంది. ఎన్నికల హామీగా ఇచ్చిన జిల్లాల విభజన గణతంత్ర దినోత్సవం వరకు పూర్తి చేసేలా సీఎం జగన్ మోహన్ రెడ్డి యోచిస్తున్నారు. లోక్ సభ నియోజకవర్గాలను ఒక్కో జిల్లాగా మొత్తం 25 జిల్లాలను చేయనున్నారు. దానికి అనుగుణంగా కసరత్తు మొదలైంది. ఈ క్రమంలో పెద్ద జిల్లాలు రెండు.. మూడు జిల్లాలుగా చేయనున్నారని సమాచారం. ఈ క్రమంలో శ్రీకాకుళం జిల్లా మూడు జిల్లాలు అయ్యేలా ఉంది.

శ్రీకాకుళం జిల్లా అతి ప్రాచీనమైనది, దాని వైభవాన్ని దెబ్బ తీస్తారా అని కొందరంటారు. వెనకబడిన జిల్లాను పార్లమెంట్ ప్రాతిపదికగా విభజిస్తే అన్యాయమవుతోందని జిల్లావాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని రాజాం, ఎచ్చెర్ల వంటివి విజయనగరం పార్లమెంట్ పరిధిలో ఉన్నాయి. కొత్తగా వచ్చిన పరిశ్రమలు, విశ్వవిద్యాలయాలు అభివృద్ధి అంతా ఇక్కడే ఉంది. పార్లమెంట్ పరిధిగా తీసుకుని వేరు చేస్తే శ్రీకాకుళానికి తీరని అన్యాయం జరుగుతుందని, మరింత వెనకబడిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంట్ సీట్ల ప్రాతిపదికన జిల్లాల‌ విభజన వద్దే వద్దు అంటున్నారు.

శ్రీకాకుళాన్ని మూడు జిల్లాలుగా చేయాలని, ఎచ్చెర్ల కేంద్రంగా ఒక జిల్లా, ఉద్ధానం కేంద్రంగా మరో జిల్లా, పాలకొండ కేంద్రంగా గిరిజన జిల్లా ఏర్పాటు చేస్తేనే శ్రీకాకుళం అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నారు. పార్లమెంట్ ప్రాతిపదికన విభజన అంటే ఆందోళనలు వ్యక్తం చేసే పరిస్థితి ఏర్పడింది.