Begin typing your search above and press return to search.
అమితాబ్ బచ్చన్ బంధువును మోసగించిన కేసులో హైదరాబాదీ అరెస్ట్..?
By: Tupaki Desk | 20 Feb 2023 12:48 PM GMTబాలీవుడ్ సీనియర్ హీరో అమితాబ్ బచ్చన్ బంధువు ఓ హైదరాబాద్ చేతిలో మోసపోయిన ఘటన తాజాగా వెలుగు చూసింది. ట్రాక్టర్లు ఇప్పిస్తానని రూ. 250 కోట్లు బురిడీ కొట్టించడంతో మోసపోయానని గ్రహించిన అమితాబ్ బచ్చన్ బంధువు ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఢిల్లీ పోలీసులు హైదరాబాద్ కు చేరుకుని దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగా ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని ఢిల్లీకి తీసుకు వెళ్లినట్లు సమాచారం.
ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. అమితాబ్ బచ్చన్ ఇటీవల ఓ వ్యక్తి చేతిలో రూ.250 కోట్ల మేర మోసపోయాడు. దీంతో ఆయన గతంలోనే ఢిల్లీ పోలీసులను ఆశ్రయించాడు.
ఈ కేసులో భాగంగా ఢిల్లీ పోలీసులు తాజాగా హైదరాబాద్ కు చేరుకుని విచారణ వేగవంతం చేశారు. అయితే సంధ్య కన్వెన్షన్ ఎండీ. సంధ్య శ్రీధర్ ను అదుపులోకి తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
అమితాబ్ బచ్చన్ బంధువులకు సంధ్య కన్వెన్షన్ ఎండీ. శ్రీధర్ ట్రాక్టర్లు ఇప్పిస్తానని నమ్మించి రూ.250 కోట్లు వసూలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తమకు ట్రాక్టర్లు గానీ.. డబ్బులు గానీ తిరిగి చెల్లించకపోవడంతో అతడి చేతిలో మోసపోయినట్టు అమితాబ్ బచ్చన్ బంధువులు గ్రహించారు. దీంతో అతనిపై గతంలోనే ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు తాజాగా హైదరాబాద్ కు చేరుకొని అతడిని అరెస్టు చేసి ఢిల్లీకి తరలించారు. కాగా శ్రీధర్ అరెస్ట్ కావడం ఇదే తొలిసారి కాదని తెలుస్తోంది. పలుసార్లు ఆయన జైలుకు వెళ్లి వచ్చినట్లు తెలుస్తోంది.
గతంలోనూ గచ్చిబౌలిలో ఓ ఈవెంట్ మేనేజర్ పై దాడి కేసులో.. ఆర్గానిక్ ఫుడ్ బిజినెస్ చేస్తున్న వ్యాపారిని బెదిరించిన కేసులో శ్రీధర్ జైలుకు వెళ్లి వచ్చినట్లు సమాచారం. ఈ కేసులో పోలీసులు చివరికి ఏం తెలుస్తారనేది మాత్రం ఆసక్తికరంగా మారింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.