Begin typing your search above and press return to search.

తాటికొండ శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అసెంబ్లీలో మిస్సింగ్

By:  Tupaki Desk   |   24 March 2023 1:00 PM GMT
తాటికొండ శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అసెంబ్లీలో మిస్సింగ్
X
ఎమ్మెల్సీ ఎన్నికలలో టీడీపీకి ఓటేశారని భావిస్తున్న వైసీపీ ఎమ్మెల్యేలు తాటికొండ శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలు ఈ రోజు అసెంబ్లీకి రాలేదు. దీంతో వారిద్దరే బ్లాక్ షీప్ అంటూ వైసీపీ ఎమ్మెల్యేలు చెవులు కొరుక్కుంటున్నారు.

అసెంబ్లీ సమావేశాలకు చివరి రోజైన శుక్రవారం వైసీపీ ఎమ్మెల్యేలు తాటికొండ శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలు గైర్హాజరయ్యారు. నిజానికి నిన్న తన ఓటు హక్కు వినియోగించుకున్న వెంటనే మేకపాటి అట్నుంచి అటే బెంగళూరు వెళ్లిపోయారని.. అప్పటి నుంచి ఆయన ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తోందని చెప్తున్నారు.

మరోవైపు తాను క్రాస్ ఓటింగ్ చేయలేదని చెప్తున్న శ్రీదేవి కూడా సమావేశాలకు రాకపోవడంతో ఆమెపై అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు వైసీపీ నేతలు. తనపై వచ్చిన ఆరోపణలు శ్రీదేవి వివరణ ఇచ్చుకోగా ఇంతవరకూ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మాత్రం స్పందించిన దాఖలాల్లేవ్.

పైగా వైసీపీ పెద్దల నుంచి వరుసగా ఫోన్ కాల్స్ వెళ్లినప్పటికీ ఎలాంటి రియాక్షన్ లేదట. కొన్నిసార్లు ఫోన్ స్విచాఫ్ అని కూడా వస్తోందట. కనీసం రిటర్న్ కాల్ కూడా రాకోవడంతో అధిష్ఠానం అనుమానమే నిజమేనని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.

ఉదయగిరి నియోజకవర్గానికి పరిశీలకుడిగా ధనుంజయ్ రెడ్డిని అధిష్ఠానం నియమించడంతో మేకపాటి చాలా రోజులుగా అసంతృప్తిగా ఉన్నారు. దీంతో ఆయన టీడీపీకి ఓటు వేసి ఉంటారని ప్రచారం జరుగుతోంది.

అయితే, వీరిపై ఆరోపణలు చేయడమే కానీ చర్యలు తీసుకునే ధైర్యం పార్టీకి లేదన్న మాట వైసీపీ వర్గాల నుంచే వినిపిస్తోంది. విప్ జారీచేసినా క్రాస్ ఓటింగ్‌కు పాల్పడితే చర్యలు తీసుకోవచ్చు. కానీ.. వారే క్రాస్ ఓటింగ్ చేసినట్లు ఆధారాలుండాలి. పైగా పార్టీలో అసంతృప్తి తీవ్రంగా ఉన్న ఇలాంటి సమయంలో చర్యలు తీసుకుంటే మరిన్ని ఇబ్బందులు రావొచ్చని పార్టీ పెద్దలు భావిస్తున్నట్లు టాక్.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.