Begin typing your search above and press return to search.

వైసీపీ ఎంపీ పై వైసీపీ మంత్రి పోలీస్ కంప్లైంట్ .. రీజన్ ఇదే !

By:  Tupaki Desk   |   8 July 2020 12:30 PM GMT
వైసీపీ ఎంపీ పై వైసీపీ మంత్రి పోలీస్ కంప్లైంట్ .. రీజన్ ఇదే !
X
గత కొన్ని రోజులుగా ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారిన వైసీపీ నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు పై ఏపీ గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీ రంగనాథ రాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలోని పోడూరు మండలం పోడూరు పోలీస్ స్టేషన్ లో మంగళవారం మంత్రి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. తనపై అసత్య ఆరోపణలు చేసి తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించారని ఫిర్యాదులో మంత్రి పొందుపరిచారు.

రాజకీయ,ప్రజా జీవితంలో విమర్శలు సహజం, కానీ ఒక అవకాశవాది తన వ్యక్తిగత, స్వార్థ, రాజకీయ ప్రయోజనాల కోసం ఎదుటి వారి వ్యక్తిత్వంపై దాడి చేయడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించదలుచుకోలేదు, తనను తన కుమారుని వ్యక్తిగతంగా దూషించి దొంగలు అని సంబోధించడం పై మనస్థాపం చెందానని ఆయన పేర్కొన్నారు. తాను తన తోటి ఎమ్మెల్యేలు, మరో మంత్రి పేర్ని నాని తో కలిసి ప్రెస్ మీట్ లో మాట్లాడిన దానిని ఉదహరిస్తూ పందులే గుంపులుగా వస్తాయి అని ఎంపీ రఘురామ కృష్ణంరాజు మాట్లాడటం పై రంగనాధ రాజు ఆక్షేపించారు.

ఇన్ని సంవత్సరాలు నిజాయితీ పరుడిగా, సేవా భావం కలిగిన వ్యక్తిగా, వివాదరహితుడిగా సమాజంలో నేను సంపాదించుకున్న మంచి పేరు పై బురద చల్లుతున్నారని , అంతే కాకుండా తన కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగే విధంగా, తన వ్యక్తిత్వాన్నీ దెబ్బ తీసే విధంగా ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహరించటం దారుణమని మంత్రి రాఘనాథ రాజు పేర్కొన్నారు. సోషల్ మీడియాలో తనపై అసత్యాలను ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఎంపీ రఘురామ కృష్ణంరాజు తన మద్దతుదారులతో మంత్రి అయిన తన దిష్టి బొమ్మను తగల బెట్టి , వర్గ వైషమ్యాలు సృష్టించి, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తిగా చట్టాలను గౌరవించే వ్యక్తిగా రాజ్యాంగం ప్రసాదించిన హక్కుతో న్యాయం కోసం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని ఆయన తెలిపారు.