Begin typing your search above and press return to search.
చైనాకు శ్రీలంక కోతులు ఫిష్ట్.. కారణం ఇదే..ప్రభుత్వంపై విమర్శలు..
By: Tupaki Desk | 15 April 2023 11:00 AM GMTమనదేశంలో వానరాలకు గౌరవమిస్తాం. వాటికి అవసరమైన ఆహారాన్ని అందిస్తాం.. వాటి రక్షణ కోసం ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటాం.. ప్రస్తుతం గ్రామాల్లో కోతుల అల్లరి విపరీతంగా పెరిగిపోతుంది.. మనుషుల పై దాడులు కూడా చేస్తున్నారు.. అయితే శ్రీలంకలో కోతులు అంతకుమించి నష్టాన్ని తెస్తున్నాయట. కోతులు చేసిన పంట నష్టంతో మనుషులకు ఆహారం కోరత ఏర్పడుతుందట. అందుకే అక్కడి ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం తీసుకుంది.
శ్రీలంకలోని కోతులను చైనాకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అయితే చాలా మంది కోతుల జాతిని అంతం చేయడానికే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని విమర్శిస్తున్నారు. కానీ శ్రీలంక మంత్రి మాత్రం వానరాలను చంపడానికి కాదని చైనాలోని జూల్లో ప్రదర్శించడానికని సమాధానమిస్తున్నారు. ఇంతకీ కోతులను చైనాకు మాత్రమే ఎందుకు షిప్ట్ చేస్తున్నారు?
శ్రీలంక దేశ వ్యాప్తంగా 30 లక్షల కోతులు ఉన్నాయని మంత్రి మహింద అమరవీర తెలిపారు. గతంతో పోలి స్తే ఈ సంఖ్య చాలా ఎక్కువ అన్నారు. కోతుల వల్ల తీవ్ర పంట నష్టం జరుగుతుందని ఆయన తెలిపారు. గత ఏడాదిలో కోతుల వల్ల సుమారు రెండు కోట్ల కొబ్బరికాయలు ధ్వంసం అయ్యాయని ఆయన పేర్కొన్నారు. ఇలా పంట నష్టం జరగడంతో ఆర్థికంగా కుదేలవుతున్నామన్నారు. అందుకే కోతుల ఆగడాలను తగ్గించాలని నిర్ణయించామని తెలిపారు. ఇందులో భాగంగా చాలా వరకు కోతులను చైనాకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
కోతుల జాతిని అంతం చేయడానికే చైనాకు పంపిస్తున్నారని చాలా మంది విమర్శిస్తున్నారు. చైనాలో జంతువుల ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటారు. కోతులను కూడా చంపేసి వాటి మాంసం వినియోగిస్తారని విమర్శిస్తున్నారు. ఈ వాదనను మంత్రి తిరస్కరించారు. కోతులను చైనాకు పంపే ఉద్దేశం వేరేనని అన్నారు. శ్రీలంక నుంచి పంపే కోతులు చైనాలో 1000 జంతు ప్రదర్శన శాలలో ఉంచుతారని అన్నారు. అంతేకాకుండా ఇక్కడి కోతులను పట్టుకొని చైనాకు తరలించేవరకు ఖర్చు మొత్తం చైనానే భరిస్తుందని అన్నారు.
ఒక్కో కోతిని పట్టుకోవడానికి 5000 (భారత కరెన్నీలో రూ.1250) ఖర్చు అవుతుందని అన్నారు. కోతులను పట్టుకోవడం, వాటిని వేరు చేసిన వైద్య పరీక్షలు చేయడం, ఆ తరువాత చైనాకు రవాణా చేయడం వంటి ప్రక్రియకు బాగానే వ్యయం అవుతుంది. అయితే ఈ ఖర్చు మొత్తం చైనానే భరిస్తానని తెలపడం వల్ల ఆ దేశానికి అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. ఒక్కో కోతి కోసం చైనా శ్రీలంక కరెన్సీ ప్రకారం 30 నుంచి 50 వేల వరకు వెచ్చించడానికి సిద్ధంగా ఉంది. అందుకే ఆ దేశానికి తరలిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ మేరకు ఇటీవల ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది.