Begin typing your search above and press return to search.

ప్రజాగ్రహానికి తలవంచిన శ్రీలంక సర్కార్.. 26 మంత్రుల రాజీనామా..

By:  Tupaki Desk   |   4 April 2022 5:18 AM GMT
ప్రజాగ్రహానికి తలవంచిన  శ్రీలంక సర్కార్.. 26 మంత్రుల రాజీనామా..
X
శ్రీలంకను తీవ్ర ఆర్థిక సంక్షోభంలో పడేసిన రాజపక్షే సర్కారు కూలపోయింది. 26 మంత్రులు మూకుమ్మడిగా రాజీనామా చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి దినేశ్ గుణవర్ధనే తెలిపారు. రాష్ట్రపతి కొత్త మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేసేందుకు తాను రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. దేశంలో పరిస్థితులు దిగజారుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలిపారు. అయితే రాజీనామానకు కారణం మాత్రం స్పష్టం తెలపలేదు. ప్రధానంగా దేశంలో కర్ఫ్యూ విధించినా ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలపడంతో పాటు సోషల్ మీడియాను నిషేధం ఎత్తివేయడంపై ప్రజాగ్రహం పెల్లుబకింది. దీంతో అధ్యక్షుడు గటబయ రాజపక్షే, ప్రధాన మంత్రి మహేంద్ర రాజపక్షే మినహా 26 మంది రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.

దేశంలో ఆర్థిక పరిస్థితిపై ప్రజలు ఆందోళన చేశారు. గంటల తరబడి కరెంట్ కోతలు, ఆహారం, నిత్యావసరాలు ఇంధనం, మందుల కొరతతో ప్రజలు అల్లాడిపోయారు. అయితే ప్రభుత్వం ఈ విషయాల్లో ఆదుకోవడంలో విఫలమైందని ప్రజలు ఆందోళన చేశారు. ఈ మేరకు కోలంబో పేజీ అనే వార్తపత్రిక ఈ విషయాలను బయటపెట్టింది.

అయితే ప్రభుత్వం ఈ వార్త పత్రికతో పాటు సోషల్ మీడియా పై నిషేధం విధించింది. దేశ వ్యాప్తంగా పబ్లిక్ ఎమర్జెన్సీతో పాటు 36 గంటల పాటు కర్ఫ్పూను విధించారు. ఫేస్ బుక్, యూట్యూబ్, ట్విట్టర్, తదితర సోషల్ మీడియాలపై నిషేధం ప్రకటించారు.

అయితే శ్రీలంకలోని ప్రజలు ఈ నిషేధాన్ని పట్టించుకోలేదు. ప్రజల్లు వీధుల్లోకి వచ్చి ఆందోళనలు నిర్వహించారు. ఆహారం, గ్యాస్ కొరతపై తీవ్రంగా ఉద్యమించారు. రాజధాని కొలంబోతో పాటు పలు ప్రాంతాల్లో నిరసనలు అట్టుడికాయి. క్యాండీలో విద్యార్థులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. గొటబయా గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. రాజపక్షే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అయితే వీరు చేస్తున్న ఆందోళనపై ప్రభుత్వం తమ ప్రతాపం చూపించారు. బాష్పవాయువు, వాటర్ కెనాన్లను ఉపయోగించి వారి ఆందోళనను కట్టడి చేసేందుకు ప్రయత్నించారు. కొందరు ఆందోళనకారులపై లాఠీచార్జీ కూడా చేశారు. ఇక కరెంట్ కోతలకు నిరసనగా ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డారు.

ప్రజల అవసరాలను తీర్చాల్సిన ప్రభుత్వమే నిరసన కారులపై ప్రతాపాన్ని చూపడంపై కొందరు రాజకీయ నిపుణులు మండిపడుతున్నారు. ఆర్మికి అన్ని అధికారాలు ఇవ్వడంతో ఆందోళనకారులను అదుపు చేయడంతో వారు తీవ్ర చర్యలు తీసుకుంటున్నారు. శ్రీలంక అధ్యక్ష భవనం వైపు దూసుకెళ్లిన 100 మంది విపక్ష నేతలను పోలీసులు అడ్డుకున్నారు. వారిని కట్టడి చేసి పోలీస్ స్టేసన్లకు తరలించారు.

శ్రీలంక ప్రభుత్వం మాత్రం దేశంలో ఆర్థిక పరిస్థితికి విదేశీ మారక నిల్వలు క్షీణించడమే కారణంగా చెబుతున్నారు. వీటి నిర్వహణలో ప్రభుత్వం విఫలమైందని, అందుకే ఈ పరిస్థితి వచ్చిందని అంటున్నారు. ఇదిలా ఉండగా 26 మంది మంత్రులు రాజీనామా చేయడంతో పాటు 36 గంటల కర్ఫ్యూను ఎత్తివేశారు. అలాగే సోషల్ మీడియా సేవలను 15 గంటల తరువాత పునరుద్ధరించిటనట్లు తెలిపారు. దీంతో నిషేధానికి గురైన సైబర్ సెక్యూరిటీ, ఇంటర్నెట్ వాచ్ డాక్ నెట్ బ్లాక్స్ శ్రీలంకలో ఆదివారం అర్ధరాత్రి తరువాత పునరుద్ధరించబడ్డాయి.