Begin typing your search above and press return to search.

ఇలా అయితే మేం ఆడలేం..! జీతాల కోతపై శ్రీలంక క్రికెటర్లు

By:  Tupaki Desk   |   18 May 2021 12:30 AM GMT
ఇలా అయితే మేం ఆడలేం..!  జీతాల కోతపై  శ్రీలంక క్రికెటర్లు
X
'ఇంత తక్కువ జీతాలతో అయితే మేము ఆడలేము. జీతాల్లో కోత 10 శాతం 5 శాతమో ఉంటుంది కానీ.. ఏకంగా 35 శాతం కోత విధించడం ఏమిటీ' అంటూ ప్రస్తుతం శ్రీలంక క్రికెటర్లు ఫైర్​ అవుతున్నారు. 'మేము ఒప్పందాల మీద సంతకాలు చేయలేము' అంటూ వాళ్లు ఖరాకండిగా తేల్చిచెప్పారు. దీంతో శ్రీలంక బోర్డు తలపట్టుకొని కూర్చున్నది. శ్రీలంక క్రికెటర్లకు జీతాల్లో కోత విధించడం ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. అక్కడి క్రికెటర్లకు వేతనంలో ఏకంగా 35 శాతం కోత విధిస్తున్నట్టు శ్రీలంక క్రికెట్​ బోర్డు ప్రకటించింది. దీంతో ఆటగాళ్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

శ్రీలంక కెప్టెన్ క‌రుణ‌ర‌త్నే, క్రికెటర్లు మాథ్యూస్, సురంగ లక్మల్,దినేష్ చండిమల్ వంటి సీనియర్​ క్రికెటర్లు ప్రస్తుతం శ్రీలంక క్రికెట్​ బోర్డుపై గుర్రుగా ఉన్నారు. కొత్త ఒప్పదంపై సంతకం చేసే ప్రసక్తే లేదంటూ పట్టుపట్టుకొని కూర్చున్నారు.
ఇటీవల శ్రీలంక క్రికెట్​ బోర్డు.. ఓ కొత్త ఒప్పందాన్ని తీసుకొచ్చింది. ఈ ఒప్పందం ప్రకారం కొందరు క్రికెటర్లు లాభపడుతుండగా.. సీనియర్​ క్రికెటర్లు తీవ్రంగా నష్టపోతున్నారు. దీంతో వాళ్లు ఆగ్రహంగా ఉన్నారు.

వికెట్ కీపర్లు నిరోషన్ దిక్వేలా, ధనంజయ్ డి సిల్వా కొత్త ఒప్పందంతో లబ్ధి పొందనున్నారు. ఈ ఇద్దరు ఆటగాళ్ల నెలసరి జీతం దాదాపు రూ.73 లక్షలు. బోర్డు వీరిని టాప్ కేట‌గిరీలో వేయడంతో వీరికి లాభం చేకూరనున్నది. మే 23 నుంచి శ్రీలంక జట్టు బంగ్లాదేశ్​ లో పర్యటించాల్సి ఉంది. అక్కడ మూడు మ్యాచ్​ల వన్డే సిరీస్​ ఆడవలసి ఉంది. కానీ క్రికెటర్లు అసంతృప్తిగా ఉండటంతో అసలు ఈ మ్యాచ్ లు జరుగుతాయా? లేదా? అన్న విషయంపై అనుమానాలు నెలకొన్నాయి. కొత్త ఒప్పందంతో అనేక మంది క్రికెటర్లు నష్టపోనున్నారు. అయితే సీనియర్​ క్రికెటర్లతో శ్రీలంక బోర్డు చర్చలు జరపాలని ఫ్యాన్స్​ కోరుతున్నారు. ఇంతకీ ఏం జరగబోతున్నదో వేచి చూడాలి.