Begin typing your search above and press return to search.
బాప్ రే! ఉగ్రవాద సంస్థకు వందల కోట్ల ఆస్తులా?
By: Tupaki Desk | 7 May 2019 8:05 AM GMTఈస్టర్ సండే రోజున శ్రీలంకలో ఉగ్రవాదులు జరిపిన మారణకాండ ప్రపంచాన్ని షాక్ కు గురిచేసింది. యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ఉగ్రవాద సంస్థతో సంబంధాలు కలిగిన స్థానిక ఉగ్రవాద సంస్థ నేషనల్ తౌహీత్ జమాత్ (ఎన్ టీజే) జరిపిన ఈ ఉగ్రదాడిలో ఏకంగా 250 మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. వందల సంఖ్యలో క్షతగాత్రులయ్యారు.
ఉగ్రదాడి అనంతరం అనుమానిత ఉగ్రవాదులను అరెస్ట్ చేసిన శ్రీలంక పోలీసుల విచారణలో విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయి. ఈ ఉగ్రవాద సంస్థకు వందల కొద్దీ ఆస్తుల ఉన్న విషయం తెలిసి సీఐడీ అధికారులు నోర్లు వెళ్లబెట్టారు. ఎన్ టీజే వద్ద ఏకంగా రూ.5 కోట్ల నగదు, రూ.274 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయట. వీటిలో సగం వరకు నగదును సీఐడీ స్వాధీనం చేసుకుంది. మిగతా సొమ్ము వివిధ బ్యాంకుల్లో డిపాజిట్ల రూపంలో ఉన్నాయని పోలీసు అధికార ప్రతినిధి గుణశేఖర తెలిపారు. ఈ ఖాతాలను సస్పెండ్ చేయాలని ఆయా బ్యాంకులను ఆదేశించినట్టు చెప్పారు.
ఏప్రిల్ 21న మూడు క్యాథలిక్ చర్చిలు, మూడు స్టార్ హోటళ్లలో జరిగిన ఉగ్రదాడిలో 250 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 11 మంది భారతీయులు ఉన్నారు. దాదాపు 500 మంది గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు మొత్తం 73 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వీరందరూ ఎన్ టీజే ఉగ్రవాద సంస్థకు చెందిన వారే. వీరిలో ఏడుగురు మహిళలు సహా 54 మంది సీఐడీ అదుపులో ఉండగా, 19 మంది టెర్రరిస్ట్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్ మెంట్ (టీఐడీ) అదుపులో ఉన్నారు.