Begin typing your search above and press return to search.

సోనియమ్మ చేతికి కట్టు ఇంకా తీయలేదు

By:  Tupaki Desk   |   6 Oct 2016 7:38 AM GMT
సోనియమ్మ చేతికి కట్టు ఇంకా తీయలేదు
X
అదేంటో.. పేరు చివరన ‘అమ్మ’ ఉండటం.. లేదంటే.. ‘అమ్మ’గా కీర్తించుకునేవారికి టైం బాగోనట్లుగా ఉంది. దాదాపు రెండు నెలల కిందట కాంగ్రెస్ అధినేత్రి.. సోనియమ్మ హఠాటాత్తుగా అనారోగ్యానికి గురి కావటం.. ఆమెను యుద్ధప్రాతిపదికన హెలికాఫ్టర్ లో తరలించటమే కాదు.. ఎయిర్ పోర్ట్ దగ్గరే తాత్కాలికంగా ఒక మొబైల్ ఆసుపత్రిని ఏర్పాటు చేసి ఆమెకు చికిత్స అందించటాన్ని మర్చిపోలేం.

కొద్ది నెలల అనంతరం యూపీలో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు పార్టీని సమాయుత్తం చేసే పనిలో భాగంగా కాంగ్రెస్ అధినేత్రి.. మోడీ అడ్డా అయిన వారణాసిలో భారీ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా పోటెత్తిన ప్రజల్ని చూసిన ఆమె ఉత్సాహంతో విపరీతంగా చేతులు ఊపారు. ఆ మాత్రం దానికే ఆమె చేతికి ఫ్యాక్చర్ కావటంతోపాటు.. తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

దీంతో.. ర్యాలీ మధ్య నుంచే ఆమెను హుటాహుటిన ఢిల్లీకి తరలించారు.అనంతరం ఆమెను ఆసుపత్రిలో చేర్పించి.. కొద్దిరోజుల పాటు అక్కడే ఉంచేశారు. తర్వాత డిశ్చార్జ్ చేసినప్పటికి రెండు.. మూడు రోజులకే ఆమెను మళ్లీ ఆసుపత్రికి తరలించటంతో ఆమె ఆరోగ్యంపై పలు సందేహాలు వ్యక్తమయ్యాయి. ఆ తర్వాత ఆమెకు సంబంధించిన వార్తలు మీడియాలో పెద్దగా రాలేదు. ఆమె కూడా బయటకు వచ్చింది లేదు.

అప్పటి నుంచి మీడియాలో కనిపించింది లేదు. రెండు నెలలు గడిచిన తర్వాత తాజాగా.. శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమ సింఘేను కలిశారు. ఈ సందర్భంగా ఆమెకు సంబంధించిన ఫోటో ఒకటి మీడియాలో వచ్చింది. ఈ ఫోటోలో అమ్మ చేతికి నల్లటి పట్టీతో కట్టు కట్టినట్లు కనిపిస్తోంది. దాదాపు రెండు నెలల తర్వాత కూడా ఆమె చేతికి కట్టిన పట్టీ తీయకపోవటం గమనార్హం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/