Begin typing your search above and press return to search.
జూనియర్ ఎన్టీఆర్ పై పరిణితి చెందిన ప్రకటన చేసిన బాలకృష్ణ చిన్నల్లుడు
By: Tupaki Desk | 27 Nov 2021 1:30 AM GMTచంద్రబాబు సతీమణి, సీనియర్ ఎన్టీఆర్ కుమార్తెపై వైసీపీ నేతల బూతుల పర్వంపై స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ సరిగ్గా స్పందించలేదని టీడీపీ నేతలు ఆడిపోసుకుంటున్న సంగతి తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ ను టార్గెట్ చేసి ఆడిపోసుకుంటున్నారు. జూనియర్ స్పందన వైసీపీకి అనుకూలంగా ఉందని విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే బాలకృష్ణ చిన్నల్లుడు చాలా పరిణతితో స్పందించాడు.
టీడీపీ సీనియర్ నాయకుడు వర్ల రామయ్య మాట్లాడుతూ ఇటీవల అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు-అతని భార్య భువనేశ్వరిపై జరిగిన అవమానకర ఘటనపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించిన తీరు తనకు నచ్చలేదని అన్నారు. ఈ సంఘటన గురించి జూనియర్ ఎన్టీఆర్ చాలా వైసీపీకి అనుకూలంగా మాట్లాడారని, ఇలాంటి సమయంలో నారా వారికి కుటుంబానికి అండగా నిలవాలని వర్ల అన్నారు. మరో ఇద్దరు ప్రముఖ టీడీపీ నేతలు ఇదే వాదన చేశారు. వర్ల వ్యాఖ్యలపై తారక్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో సోషల్ మీడియాలో టీడీపీ వర్సెస్ ఎన్టీఆర్ వార్ మొదలైంది.
ఇప్పుడు బాలకృష్ణ చిన్న అల్లుడు భరత్ దీనిపై చాలా మెచ్చుర్డ్ గా స్పందించారు. "మొదట ఈ సంఘటనపై స్పందించినందుకు జూనియర్ ఎన్టీఆర్‌ను అభినందించాలి. ఇదే అంశంపై ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడించారు. అతను స్పందించిన విధానం పూర్తిగా న్యాయమైనది.. మరింత దూకుడుగా వ్యవహరించనందుకు మేము అతనిని విమర్శించలేము. అతని కుటుంబ సభ్యుడు మాటలతో దాడి చేసినప్పుడు అతను బయటకు వచ్చాడు. దాని గురించి వ్యతిరేకంగా మాట్లాడడం అసంబద్ధం " అని భరత్ అన్నారు.
జూనియర్ ఎన్టీఆర్ ను వెనకేసుకొస్తూ భరత్ మరో మంచి ఉదాహరణను చెప్పుకొచ్చాడు. "ఉదాహరణకు సినిమా టిక్కెట్ల రేటు సమస్య ఇప్పుడు బర్నింగ్ టాపిక్. కానీ ఒక్క తెలుగు హీరో కూడా దీని గురించి మాట్లాడటం లేదు. అయినప్పటికీ వారు దాని గురించి ఆందోళన చెందరని దీని అర్థం కాదు " అని నొక్కిచెప్పాడు. టీడీపీ వర్సెస్ ఎన్టీఆర్ వార్ తీవ్ర స్థాయికి చేరుకుంటున్న తరుణంలో టీడీపీ నుంచి ఎవరైనా పరిణతితో వ్యవహరించాల్సిన ఆవశ్యకత ఉందని బాలయ్య అల్లుడు భరత్ తన ప్రకటనతో అందరికీ చాటిచెప్పాడు.