Begin typing your search above and press return to search.
లోకేష్ మనసులో మాటనే శ్రీభరత్ చెప్పాడా!
By: Tupaki Desk | 26 Aug 2019 7:45 AM GMTబాలకృష్ణ చిన్నల్లుడు జూనియర్ ఎన్టీఆర్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై ఆ హీరో అభిమానుల్లోనూ - తెలుగుదేశం వీరాభిమానుల్లోనూ చర్చ జరుగుతూ ఉంది. తారక్ అవసరం తెలుగుదేశం పార్టీకి లేదని శ్రీభరత్ తేల్చి చెప్పాడు. తారక్ అవసరం తెలుగుదేశం పార్టీకి ఉందని తాము ఫీల్ కావడం లేదని లోకేష్ తోడల్లుడు వ్యాఖ్యానించాడు. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చిత్తుగా ఓడాకా - స్వయంగా ఎంపీగా ఓడిన భరత్ ఈ వ్యాఖ్యలు చేయడం ఒకింత సంచలనంగా మారింది.
ఈ విషయంలో మిశ్రమ స్పందన వినిపిస్తూ ఉంది. పార్టీ కష్టకాలంలో ఉన్న వేళ ఇలాంటి వ్యాఖ్యలు ఎంత వరకూ పార్టీకి మేలు చేస్తాయనేది ఆ పార్టీ అభిమానుల ప్రశ్న. లోకేష్ టాలెంట్ ఏమిటో తెలుగు ప్రజలకు స్పష్టంగా అర్థం అయ్యింది. ఇప్పటికీ మీడియా ముందుకు వచ్చి మాట్లాడే ధైర్యం లోకేష్ కు లేదు. తను నోరు విప్పితే తెలుగుదేశం పార్టీ పరువు పోయేదే కానీ - ప్రయోజనం అయితే ఇసుమంతైనా ఉండదనే అభిప్రాయాలు తెలుగుదేశం వర్గాల నుంచినే వినిపిస్తూ ఉన్నాయి.
స్వయంగా ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారాయన. నామినేటెడ్ పోస్టుతో మంత్రి కావడమే లోకేష్ చేసిన పెద్ద పొరపాటు. అలా మంత్రి ముచ్చట తీరింది కానీ - ఎమ్మెల్యేగా ఓడిపోవడంతో లోకేష్ పై ఎలాంటి అంచనాలూ పెట్టుకోలేకపోతున్నారు. ఇక చంద్రబాబు నాయుడుకు వయసు మీద పడుతున్న సంకేతాలు స్పష్టం అవుతున్నాయి. ఆయన చికిత్స కోసం విదేశాలకు వెళ్లి వస్తున్నారు. చేతులకు బ్యాండేజీలు - రకరకాల వైద్యప్రక్రియలతో ఆయన కనిపిస్తూ ఉన్నారు. ఇలాంటి తరుణంలో శ్రేణుల్లోకి ఎలాంటి సంకేతాలు వెళ్తాయో చెప్పనక్కర్లేదు. చంద్రబాబు నాయుడుకు ఆరోగ్యం బాగోలేదనే పార్టీలోని చాలా మంది బీజేపీ వైపు తరలిపోతున్నారనే టాక్ కూడా ఉంది. లోకేష్ ను నమ్ముకుంటే అంతే సంగతే అని వారు అంటున్నారట!
కాస్తో కూస్తో నమ్మకం, అంచనాలున్నది తారక్ మీదే. అయితే అతడికి పార్టీలోకి ఎంట్రీనే లేదనే సంకేతాలను ఇస్తున్నారు లోకేస్ సన్నిహితులు. జూనియర్ ఎన్టీఆర్ కు తలుపులు మూసేసినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇందుమూలంగా తెలుగుదేశం పార్టీలో తారక్ మీద ఆశలతో కొనసాగుతున్న వారికి స్పష్టమైన సంకేతాలే అందినట్టే అని పరిశీలకులు అంటున్నారు. లోకేష్ మనసులోని మాటే భరత్ ద్వారా బయటకు వచ్చిందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.