Begin typing your search above and press return to search.

కేటీఆర్ ఫెయిల్యూర్ గురించి అడిగిన ఆ విద్యా సంస్థల అధ్యక్షుడు

By:  Tupaki Desk   |   18 Aug 2021 5:30 AM GMT
కేటీఆర్ ఫెయిల్యూర్ గురించి అడిగిన ఆ విద్యా సంస్థల అధ్యక్షుడు
X
ఇటీవల కాలంలో మంత్రి కేటీఆర్ కు ఎప్పుడు ఎదురుకాని ఒక ప్రశ్న ఎదురైంది. అది కూడా మరో ప్రముఖుడి నోటి నుంచి. ఈ ఆసక్తికర సన్నివేశానికి వేదికైంది సంగారెడ్డిలోని గీతం కళాశాల. ఆ కాలేజీలో జరుగుతున్న కార్యక్రమానికి హాజరయ్యారు మంత్రి కేటీఆర్. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగే ప్రశ్నలకు కేటీఆర్ సమాధానం ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. పనిలో పనిగా కళాశాల లెక్చరర్లకు మాత్రమే కాదు కాలేజీ అధినేత భరత్ కూడా ముందుకొచ్చారు.

ప్రముఖ నటుడు నందమూరి బాలక్రిష్ణ అల్లుడిగా సుపరిచితుడైన శ్రీభరత్ గీతం విద్యా సంస్థల అధినేతగా తెలిసిందే. సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీగా తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి ఓటమి పాలు కావటం తెలిసిందే. మంత్రికేటీఆర్ ను ఆయన అనూహ్యమైన ప్రశ్నను సంధించారు. మీ రాజకీయ జీవితంలో ఫెయిల్ అయిన ఘటనలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. దీనికి కేటీఆర్ ఇచ్చిన సమాధానం ఆసక్తికరంగా మారింది. తనకు వచ్చిన అవకాశాన్ని కేంద్రంపై రాజకీయ విమర్శ చేసేందుకు.. అదే సమయంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం తాము చేస్తున్న పోరాటాన్ని ఆయన చెప్పకనే చెప్పేయటం గమనార్హం.

జీవితంలో ఫెయిల్ కాని వ్యక్తి ఎవరూ ఉండరన్న కేటీఆర్.. ‘ఫెయిల్యూర్ ను సెలబ్రేట్ చేసుకోవాలి. మార్గం ఏదైనా కష్టపడి పని చేయటానికి మించింది ఏదీ లేదు. సక్సెస్ కు షార్ట్ కట్ ఉండదు. నా జీవితంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశం ఆలస్యమైనప్పుడు కొంత బాధేసింది. ఎందరో ఆత్మహత్య చేసుకున్నారు. అది కూడా బాధించింది. ఇటీవల కేంద్రమంత్రిని కలిసి హైదరాబాద్ - బెంగళూరు మధ్య డిఫెన్స్ పరిశ్రమలు ఏర్పాటు చేయలని కోరాను. కానీ యూపీలో పెట్టాలని నిర్ణయం జరిగిపోయిందని కేంద్రమంత్రి చెప్పారు. కారణం.. యూపీలో ఎంపీ సీట్లు ఎక్కువ. ఇక్కడ తక్కువ కావటమేనని వ్యాఖ్యానించారు. మొత్తంగా ఫెయిల్యూర్ గురించి అడిగినప్పుడు కేసీఆర్ నోటి నుంచి వచ్చిన మాటలు ఆసక్తికరంగా మారాయి.

నిరుద్యోగులందరికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వటం ప్రపంచంలో ఎక్కడా సాధ్యం కాదని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఉపాధి అవకాశాల్ని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ప్రైవేటు ఎంప్లాయిమెంట్ పై ఫోకస్ పెట్టిందన్నారు. రానున్న రోజుల్లో ప్రభుత్వ ఖాళీల్ని భర్తీ చేస్తామన్నారు.