Begin typing your search above and press return to search.
ఆత్మ సాక్షి గ్రూప్ (SAS Group) సంచలన సర్వే : పశ్చిమ లో ఏ పార్టీ పతాకం ఎగురుతుంది....?
By: Tupaki Desk | 8 March 2023 10:33 AM GMTఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఈసారి ఎన్నికలు వస్తే సీన్ ఎలా ఉంటుంది. ఇపుడు ఏపీవ్యాప్తంగా దీని మీదనే చర్చ సాగుతోంది. గోదావరి జిల్లాలో పశ్చిమ స్పెషాలిటీ వేరు. ఇది క్రిష్ణా జిల్లాకు ఆనుకుని ఉంటుంది. దాంతో ఆ ప్రభావం కూడా కనిపిస్తుంది. అదే టైం లో ఇక్కడ తెలుగుదేశం బలంగా ఉంది. జనసేన పుంజుకుంటోంది. దాంతో అధికార వైసీపీకి ట్రబుల్స్ తప్పవని అంటున్నారు. అదే నిజం అయ్యేలా ఉందని ఆత్మ సాక్షి గ్రూప్ (ఎస్ ఏ ఎస్ గ్రూప్) సంచలన సర్వే చెబుతోంది. ఆ సర్వే ప్రకారం చూస్తే వైసీపీ భారీగానే 2024 ఎన్నికల్లో నష్టపోతుంది అని అంటోంది.
ఇక వివరాల్లోకి వెళ్తే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం పదిహేను సీట్లు ఉన్నాయి. ఇందులో టీడీపీ మొత్తంగా ఎనిమిది సీట్లు గెలుచుకుంటుందని సర్వే చెబుతోంది. వైసీపీ రెండంటే రెండు సీట్లకే పరిమితం అవుతుందని అంటోంది. మూడు సీట్లలో జనసేన జెండా ఎగరవేస్తుందని, మరో రెండు సీట్లలో హోరాహోరీ పోరు సాగుతుందని చెబుతోంది.
ముందుగా టీడీపీకి దక్కే సీట్లు చూసుకుంటే పాలకొల్లు, ఆచంట, ఉంగుటూరు, దెందులూరు, తణుకు, కొవ్వూరు, పోలవరం, ఉండి సీట్లు ఉన్నాయి. వైసీపీ గెలిచే సీట్లు చూస్తే ఏలూరు, గోపాలపురం సీట్లు గా ఉన్నాయి. జనసేన గెలుచుకునే సీట్లు చూస్తే భీమవరం, నర్సాపురం, తాడేపల్లిగూడెం గా ఉన్నాయి. హోరా హోరీ పోరు చూసుకుంటే నిడదవోలు, చింతలపూడి ఉన్నాయి.
ఇక వైసీపీ నుంచి జిల్లాలో ప్రాతినిధ్యం వహిస్తున్న ముగ్గురు మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణ, తానేటి వనిత ఓడిపోతారని ఈ సర్వే చెబుతోంది. తణుకులో కారుమూరి ఓడి టీడీపీ గెలుస్తోంది అంటోంది. అలాగే మరో మంత్రి కొట్టు సత్యనారాయణ తాడేపల్లిగూడెంలో ఓడి జనసేన ఆ సీటు గెలుస్తుంది అని సర్వే చెబుతోంది. మూడవ మంత్రి కొవ్వూరు నుంచి పాతినిధ్యం వహిస్తున్న తానేటి వనిత ఓడి టీడీపీ గెలుస్తుంది అని సర్వే అంటోంది. ఇక ఓడిపోయే వైసీపీ ఎమ్మెల్యేలు చూస్తే మాజీ మంత్రి చేరుకువాడ శ్రీరంగనాధరాజు ఆచంటలో తన సీటు కోల్పోతారని అక్కడ టీడీపీ గెలవబోతోందని సర్వే అంటోంది.
అదే విధంగా చూస్తే ఉంగుటూరు నుంచి వైసీపీ ఎమ్మెల్యే పుప్పాల శ్రీనివాసరావు ఓడతారని, టీడీపీ గెలుస్తుందని సర్వే అంటోంది. అలాగే, దెందులూరులో చూస్తే వైసీపీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి ఓడి చింతమనేని ప్రభాకర్ గెలవబోతున్నట్లుగా సర్వే అంటోంది. పోలవరం నుంచి వైసీపీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఓడి ఆ సీటుని టీడీపీ గెలుచుకుంటుందని సర్వే వెల్లడిస్తోంది.
ఇక వైసీపీ నుంచి ఇక్కడ జనసేన గెలుచుకునే సీట్లు చూస్తే భీమవరం నుంచి గ్రంధి శ్రీనివాస్ ఈసారి ఓడిపోతారట. ఈయన 2019లో పవన్ కళ్యాణ్ణి ఓడించారు. ఇపుడు జనసేన ఆయన్ని ఓడించబోతోంది అన్నది సర్వే రిపోర్టు. అలాగే నర్సాపురంలో వైసీపీ ఎమ్మెల్యే ప్రసాదరాజు జనసేన చేతిలో ఓడిపోతారని సర్వే నివేదిక చెబుతోంది. నిడదవోలులో, చింతలపూడి వైసీపీ ఎమ్మెల్యేలు గెడ్డం శ్రీనివాసనాయుడు, ఎలీజా హోరా హోరీ పోరులో చిక్కుకున్నరని సర్వే చెబుతోంది. మొత్తానికి పశ్చిమలో వైసీపీకి దారుణమైన నష్టం కలుగుతోందా అంటే ఈ సర్వే అదే చెబుతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.