Begin typing your search above and press return to search.
ఆత్మ సాక్షి గ్రూప్ (SAS Group) సంచలన సర్వే : తూర్పులో మార్పు తప్పదా....?
By: Tupaki Desk | 8 March 2023 9:22 AM GMTఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో రాజకీయ మార్పు ఎపుడూ ఏపీలో అధికారం మీద తీవ్ర ప్రభావం చూపిస్తుంది. తూర్పు మార్పుకు నాంది అని సెంటిమెంట్ ఉంది. 2014లో తెలుగుదేశం తూర్పులో మెజారిటీ సీట్లు గెలుచుకుంది. ఫలితంగా అధికారం సొంతం అయింది. అదే బొమ్మ తిరగబడి వైసీపీ పెద్ద ఎత్తున గెలిచింది. దాంతో జగన్ సీఎం అయ్యారు. ఇపుడు తూర్పు లో ఏ రకమైన రాజకీయ సమీకరణలు ఉన్నాయి. 2024లో ఎవరు సీఎం అయ్యేది అన్నది చూడాలంటే మాత్రం కచ్చితంగా ఒక అంచనా అయితే ముందు ఉంది.
అదే శ్రీ ఆత్మ సాక్షి గ్రూప్ (ఎస్ ఎ ఎస్ గ్రూప్ ) తాజాగా విడుదల చేసిన సర్వే నివేదికలో ఏ ఏ పార్టీకి ఎంత బలం ఉంది అన్నది ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో లెక్క చూసి మరీ చెప్పుకొచ్చింది. ఈ జిల్లాలో మొత్తం 19 సీట్లు ఉన్నాయి. ఏపీలో అత్యధిక సీట్లు ఉన్న ఉమ్మడి జిల్లా ఇది. 2019లో వైసీపీ ఇక్కడ పదిహేను సీట్లు గెలుచుకుని జెండా ఎగరేసింది. మూడు సీట్లు టీడీపీకి దక్కాయి. ఒకటి జనసేనకు లభించింది.
ఇక 2024 లో చూసుకుంటే మొత్తం సీట్లలో టీడీపీకి ఆరు వైసీపీకి ఆరు, మరో నాలుగు జనసేనకు దక్క్తాయని, మూడు సీట్లలో హోరాహోరీ పోరు ఉంటుందని శ్రీ ఆత్మ సాక్షి గ్రూప్ (ఎస్ అ ఎస్ గ్రూప్) సర్వే చెబుతోంది. తెలుగుదేశం గెలుచుకునే సీట్లు ఏంటి అన్నది చూస్తే కనుక పెద్దాపురం, ప్రతిపాడు, జగ్గంపేట, అమలాపురం, ముమ్మిడివరం, రాజమండ్రి అర్బన్ గా ఉన్నాయి.
వైసీపీ గెలుచుకునే సీట్లు చూస్తే రామచంద్రాపురం, రంప చోడవరం, కాకినాడ అర్బన్, అనపర్తి, తుని, రాజానగరంగా ఉన్నాయి. ఇక జనసేన గెలుచుకునే సీట్లు చూస్తే పిఠాపురం, రాజమండ్రి రూరల్, రాజోలు, కొత్తపేటగా ఉన్నాయి. మూడు సీట్లలో హోరా హోరీ పోరు ఉంది. అవేంటి అంటే పి గన్నవరం, మండపేట, కాకినాడ రూరల్ గా సర్వే తేల్చింది.
ఇక్కడ చూస్తే వైసీపీ పదిహేను సీట్లు గెలుచుకున్న చోట ఆరు సీట్లే కచ్చితంగా వస్తాయి అంటే తొమ్మిదింటిలో ఇబ్బంది పడుతోంది అని సర్వే చెబుతోంది. ఆ తొమ్మిదిలో నిన్నటి మంత్రి అయిన కురసాల కన్నబాబు ఉన్నారు. ఆయన సీటు అయిన కాకినాడ రూరల్ లో హోరాహోరీ పోరు ఉంది. అంటే డౌట్ కింద లెక్క కట్టారు. అమలాపురం నుంచి గెలిచి మంత్రిగా ఉన్న పినిపె విశ్వరూప్ అయితే ఓడిపోతారని సర్వే స్పష్టం చేసేసింది.
అలాగే ఓడిపోయే ఎమ్మెల్యేలలో జగ్గంపేటలో వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు ఉన్నారు. ప్రత్తిపాడులో వైసీపీ ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రరావు ఓడే లిస్ట్ లో ఉన్నారని సర్వే అంటోంది. ఇక ముమ్మిడివరంలో వైసీపీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ కి ఓటమి తప్పదని సర్వే జోస్యం చెబుతోంది. ఇవన్నీ తెలుగుదేశం ఖాతాలోకి వెళ్లబోతున్నాయి.
ఇక వైసీపీ ఓడి జనసేనకు వెళ్లే సీట్లు ఏంటి అంటే పిఠాపురం వైసీపీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఓడిపోయే లిస్ట్ లో ఉన్నారు. అలాగే రాజోలు జనసేన సీటే. అయితే అక్కడ గెలిచిన రాపాక వరప్రసాదరావు వైసీపీకి జై కొట్టారు. ఈసారి ఆయన వైసీపీ తరఫున నిలబడినా ఓడుతారు అనే అంటోంది సర్వే. అలా ఆ సీటు జనసేన మళ్ళీ గెలుచుకుంటుంది అన్న మాట. కొత్తపేటలో చూస్తే వైసీపీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఓడి జనసేన గెలుస్తుందని సర్వే అంటోంది.
హోరాహోరీలో ఉనన్ మరో రెండు సీట్లు చూస్తే పి గన్నవరంలో వైసీపీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు, మండపేట నుంచి వి జోగేశ్వరరావు ఉన్నారు. మొత్తానికి తూర్పులో భారీ మార్పులే చోటు చేసుకోబోతాయని ఈ సర్వే తేటతెల్లం చేసింది అన్న మాట.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.