Begin typing your search above and press return to search.
ఈ 'సారీ' ఆర్సీబీకి నిరాశే..రైజర్స్ రయ్ రయ్ మంటూ ముందుకు
By: Tupaki Desk | 7 Nov 2020 3:45 AM GMTఐపీఎల్ లో ఎలాగైనా కప్ సాధించాలని కొన్నేళ్లుగా కలలు కంటున్న బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ కల ఈ ఏడాది కూడా కలగానే మిగిలిపోయింది. ఆ జట్టు సంవత్సరం ఫేవరెట్స్ లో ఒకటిగానే బరిలోకి దిగుతుంది. దానికి కారణం ఏమిటంటే ఆ జట్టును నడిపించేది విరాట్ కోహ్లీ కాబట్టి. ప్రతి సంవత్సరం ఐపీఎల్ సీజన్ ప్రారంభమైన ప్రతిసారి ఈసారి కప్పు బెంగళూరు అనుకోవడం అభిమానులకు అలవాటుగా మారింది. అలాగే ఈ ఏడాది కూడా అభిమానులు బెంగళూరు కప్ గెలుస్తుందని ఆశలు పెట్టుకున్నారు. బెంగళూరు ఎప్పట్లాగే అభిమానుల ఆశలు వమ్ము చేస్తూ శుక్రవారం రాత్రి జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో దారుణంగా ఓడి ఇంటి బాట పట్టింది. సన్ రైజర్స్ ఈ విజయంతో క్వాలిఫయర్ -2కు అర్హత సాధించింది.
క్వాలిఫయర్ -2లో భాగంగా హైదరాబాద్ ఢిల్లీ క్యాపిటల్స్ ను ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్లో విజయం సాధించిన జట్టు ఫైనల్ చేరనుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ 6 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది. విజయం ఇరుజట్లనూ దోబూచులాడగా విజయాన్ని హైదరాబాద్ దక్కించుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో బెంగళూరు ఓడిపోయింది.
ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు హైదరాబాద్ బౌలర్ల ధాటికి 7 వికెట్లను కోల్పోయి 132 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్ గా దిగిన కోహ్లీ, మరో ఓపెనర్ పడిక్కల్, (1) దారుణంగా విఫలం అయ్యారు. దూబే 8, సుందర్ 5, సైనీ 3 (నాటౌట్), సిరాజ్ 10 (నాటౌట్) పరుగులు చేశారు. మొయిన్ అలీ డకౌట్ అయ్యాడు. డివిలియర్స్ ఒక్కడే ఒంటరి పోరాటం కొనసాగిస్తూ 43 బంతుల్లో 5 ఫోర్లతో 56 పరుగులు చేశాడు. ఫించ్ 30 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్ తో 32 పరుగులు చేశాడు. హైదరాబాద్ బౌలర్లలో హోల్డర్ మూడు వికెట్లు తీసుకోగా, నటరాజన్ 2, నదీమ్ ఒక వికెట్ పడగొట్టాడు
స్వల్ప లక్షాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన హైదరాబాద్ జట్టుకు అంత సులభంగా విజయం దక్కలేదు. కడదాకా పోరాడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్ లో గాయం కారణంగా సాహా బరిలోకి దిగకపోవడంతో అతడి స్థానంలో కీపర్ గా, ఓపెనర్ గా శ్రీవాట్స్ గోస్వామి ఆడగా అతడు డకౌట్ అయ్యాడు. మరో ఓపెనర్ కెప్టెన్ వార్నర్17 (17 బంతుల్లో 3 ఫోర్లు ), మనీశ్ పాండే (21 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్ ) పరుగులకే పరిమితం కాగా విలియమ్సన్(44 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్ల) ఒంటరి పోరాటం చేస్తూ అర్ధ సెంచరీ సాధించడంతో పాటు జట్టుకు విజయాన్ని అందించాడు. అతడికి హోల్డర్ అండగా నిలిచాడు. చివర్లో సాధించాల్సింది పెరిగిపోగా హోల్డర్ రెండు ఫోర్లు కొట్టి హైదరాబాద్ ను గెలిపించాడు.