Begin typing your search above and press return to search.

ప్లే ఆఫ్స్​ కు సునాయసం గా.. ముంబైని చిత్తు చేసిన సన్​ రైజర్స్​

By:  Tupaki Desk   |   4 Nov 2020 3:30 AM GMT
ప్లే ఆఫ్స్​ కు సునాయసం గా..  ముంబైని చిత్తు చేసిన సన్​ రైజర్స్​
X
సన్​రైజర్స్​కు లీగ్​లో అది ఆఖరి మ్యాచ్​. చావో రేవో తేల్చుకోవాల్సిన సమయం. ముందున్నది బలమైన ముంబై ఇండియన్స్​ జట్టు. బ్యాటింగ్​, బౌలింగ్​లో తనకన్నా ఎన్నో రెట్లు స్ట్రాంగ్​గా ఉన్న ఓ జట్టును సన్​రైజర్స్​ మట్టికరింపించింది. బ్యాటింగ్​, బౌలింగ్​, ఫీల్డిండ్​లో తిరుగులేని ప్రతిభ చూపి గెలుపు తీరాలను చేరుకున్నది. ఆఖరి లీగ్​ లో గెలిచి తాము గెలుపుగుర్రాలమేనంటూ నిరూపించుకుంది వార్నర్​ సేన. సన్​రైజర్స్​ బౌలర్లు అద్భుతమైన ప్రదర్శన ఇవ్వడంతో ముంబై ఇండియన్స్​ కేవలం 150 పరుగులు మాత్రమే చేసింది. ఆ లక్ష్యాన్ని వార్నర్​ సెన సునాయాసంగా ఛేదించింది. ఓపెనర్లే మ్యాచ్​ ను గెలిపించారు. వార్నర్‌, సాహా జంట మెరుపులు మెరిపించడంతో సన్​రైజర్స్​ సునాయాసంగా ప్లేఆఫ్స్​ కు చేరుకున్నది.

కోల్​కతా నైట్​రైడర్స్​ ఇంటి బాట పట్టింది.
ముంబై ఇండియన్స్‌ను బౌలర్లు సందీప్‌ (3/34), నదీమ్‌ (2/19), హోల్డర్‌ (2/25) కట్టడి చేశారు. దీంతో ఆ టీం కేవలం 149 పరుగులు మాత్రమే చేయగలిగింది. డేవిడ్‌ వార్నర్‌ (58 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్‌తో 85 నాటౌట్‌), సాహా (45 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 58 నాటౌట్‌) ఫామ్‌ను కొనసాగించడంతో హైదరాబాద్‌ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. రన్‌రేట్‌తో రైజర్స్‌ ప్లే ఆఫ్స్​లోకి వెళ్లగలిగింది.ముందుగా బ్యాటింగ్‌ కు దిగిన ముంబై ఇండియన్స్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 149 పరుగులు చేసింది. పొలార్డ్‌ (41), సూర్యకుమార్‌ యాదవ్‌ (36), ఇషాన్‌ కిషన్‌ (33) రాణించారు. హైదరాబాద్‌ 17.1 ఓవర్ల లో వికెట్‌ నష్టపోకుండా 151 పరుగులు చేసి గెలిచింది. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ గా షాబాజ్‌ నదీమ్‌ నిలిచాడు.

బుమ్రా, బౌల్ట్‌ లేకుండానే..

నిజానికి ఈ మ్యాచ్​లో ముంబై జట్టులో బుమ్రా, బౌల్ట్‌ లేకపోవడం సన్​రైజర్స్​కు కలిసివచ్చింది. వీళ్లిద్దరూ ఉంటే హైదరాబాద్​కు లక్ష్య ఛేదన కష్టంగా మారేది. 150 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన వార్నర్​ సేన ఆరంభం నుంచే అదరగొట్టింది. రెండో ఓవర్‌లో సాహా 6,4.. మరుసటి ఓవర్‌ లో 4,4తో బ్యాట్‌ కు పనిచెప్పాడు. ఇక నాలుగో ఓవర్‌లో వార్నర్‌ వరుసగా 4,4,4తో ముంబైపై దాడికి దిగాడు. ఈ జోరుతో పవర్‌ప్లేలోనే స్కోరు 56కి చేరింది. కానీ లక్ష్యం భారీగా లేకపోవడంతో జట్టు ఇబ్బందిపడలేదు. 12వ ఓవర్‌లో సిక్సర్‌తో వార్నర్‌ 35 బంతుల్లో అర్ధసెంచరీ సాధించగా అదే ఓవర్‌ లో సాహా కూడా 34 బంతుల్లో హాఫ్​ సెంచరిని పూర్తి చేసుకున్నాడు. ముంబై బౌలర్లు పెద్దగా రాణించకపోవడంతో ఓపెనర్లు 17.1 ఓవర్లలోనే మ్యాచ్​ ను ముగించారు.


తడబడ్డ ముంబై బ్యాట్స్​మెన్​

టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేపట్టిన ముంబై బ్యాట్స్​మెన్లు పెద్దగా రాణించలేకపోయారు. చాలా గ్యాప్​ తర్వాత ఓపెనర్‌గా వచ్చిన కెప్టెన్‌ రోహిత్‌ (4) నిరాశపరిచాడు. డికాక్‌ (25) మాత్రం కొంచెం పర్వాలేదనిపించాడు. తొందరగా అవుట్​ కావడంతో జట్టు కష్టాల్లో పడింది. తర్వాత సూర్యకుమార్‌ దాటిగా ఆడుతూ స్కోర్ ​బోర్డును పరుగులు పెట్టించాడు. పవర్‌ ప్లే లో జట్టు 48 పరుగులు చేసింది. ఇషాన్‌తో కలిసి అతడు స్కోరును చక్కదిద్దుతున్న సమయంలో 12వ ఓవర్‌లో స్పిన్నర్‌ నదీమ్‌ ఝలక్‌ ఇచ్చాడు. సూర్యకుమార్‌, క్రునాల్‌ (0) వికెట్లను తీశాడు. ఆ వెంటనే సౌరభ్‌ (1)ను రషీద్‌ అవుట్‌ చేయడంతో 82 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. 15వ ఓవర్‌లో పొలార్డ్‌ ఇచ్చిన రిటర్న్‌ క్యాచ్‌ను రషీద్‌ అందుకో లేకపోయాడు. మరోవైపు సందీప్‌ తన రెండో స్పెల్‌ లో చెలరేగి ఇషాన్‌ వికెట్‌ ను తీశాడు. 19వ ఓవర్‌ లో పొలార్డ్‌ హ్యాట్రిక్‌ సిక్సర్లతో జట్టు అత్యధికంగా 20 పరుగులు రాబట్టింది. చివరి ఓవర్‌ లోనూ అతడు సిక్సర్‌ బాదినా మూడో బంతికే హోల్డర్‌ చేతిలో బౌల్డ్‌ కావడం తో స్కోరు 150లోపే ముగిసింది.