Begin typing your search above and press return to search.
సూపర్ ఓవర్ సూపర్ థ్రిల్లర్ .. ' రైజర్స్' పై 'రైడర్స్' విన్
By: Tupaki Desk | 19 Oct 2020 4:15 AM GMTకోల్ కతా-సన్ రైజర్స్ మధ్య జరిగిన మ్యాచ్ అభిమానులను ఉర్రూతలూగించింది. బ్యాట్స్ మెన్ల మెరుపులు, బౌలర్ల నిప్పులు చెరిగే బంతుల తో మ్యాచ్ సూపర్ థ్రిల్లర్ ని తలపించింది. ఎన్నాళ్ళయింది.. ఇలాంటి మ్యాచ్ చూసి.. అని అభిమానులు మురిసి పోయారు. చివరి వరకూ గెలుపు నీదా..నాదా అంటూ చేతులు మారుతూ రాగా చివరికి అది టైగా మారింది. సూపర్ ఓవర్లో చతికిల పడ్డ సన్ రైజర్స్ నైట్ రైడర్స్ కి విజయాన్ని అప్పగించింది.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 163 పరుగులు చేసింది. శుభ్ మన్ గిల్ (37 బంతుల్లో 36; 5 ఫోర్లు), కెప్టెన్ మోర్గాన్ (23 బంతుల్లో 34; 3 ఫోర్లు, 1 సిక్స్), దినేశ్ కార్తీక్ (14 బంతుల్లో 29; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులతో కోల్ కతా 163 పరుగులు చేసింది.మొదట్లో నెమ్మదిగా సాగిన కోల్ కతా ఇన్నింగ్స్ చివర్లో దూసుకెళ్లింది. మోర్గాన్, కార్తీక్ చెలరేగి చివరి ఐదు ఓవర్లలో 58 పరుగులు రాబట్టారు. చివరి ఓవర్‌లో మోర్గాన్ 4, 6 బాదడంతో 16 పరుగులు వచ్చాయి.అనంతరం ఛేదన లో సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ వార్నర్ (33 బంతుల్లో 47 నాటౌట్; 5 ఫోర్లు), బెయిర్‌స్టో (28 బంతుల్లో 36; 7 ఫోర్లు), విలియమ్సన్ (19 బంతుల్లో 29; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. రైజర్స్ సరిగ్గా 163 పరుగులే చేయడం తో మ్యాచ్ టై గా ముగిసింది.సూపర్ ఓవర్లో కోల్ కతా ను విజయం వరించింది.
మలుపు తిప్పిన ఆఖరి ఓవర్
ఆఖరి ఓవర్ లో హైదరాబాద్ విజయానికి 18 పరుగులు అవసరం కాగా.. కోల్‌కతా కెప్టెన్ బంతిని రసెల్‌కు ఇచ్చాడు. రసెల్ తొలి బంతిని నోబాల్ వేయగా ఫ్రీహిట్‌లో రషీద్‌ఖాన్ ఒక్క పరుగు సాధించాడు. అనంతరం వార్నర్ (47) వరుసగా మూడు ఫోర్లు బాదడం తో ఆట రసవత్తరంగా మారింది. ఇక 2 బంతుల్లో 4 పరుగులుగా చేయాల్సి ఉండగా తర్వాత బంతికి వార్నర్ రెండు పరుగులు తీశాడు. ఆఖరి బంతికి ఒక్క పరుగు మాత్రమే తీశాడు. దీంతో ఓవర్ లో 17 పరుగులే రావడం తో మ్యాచ్ టై గా ముగిసింది. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్ కు దారితీసింది.
సూపర్ ఓవర్ సాగిందిలా
సూపర్ ఓవర్‌లో సన్ రైజర్స్ తరపున వార్నర్, బెయిర్ స్టో బ్యాటింగ్ చేశారు. కోల్‌కతా బౌలర్ లాకీ ఫెర్గుసన్ ఎలాంటి అవకాశం ఇవ్వకుండా వార్నర్‌ను బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన సమద్ కూడా బౌల్డ్ కావడంతో రైజర్స్ 2 పరుగులేచేయగలిగింది.సూపర్ ఓవర్ ఛేదనలో రైజర్స్ రషీద్ ఖాన్ బౌలింగ్ చేయగా కోల్‌కతా 4 పరుగులు చేసి విజయాన్ని అందుకున్నారు.
గేమ్ చేంజర్ ఫెర్గూసన్
కోల్ కతా విజయంలో లాకీ ఫెర్గూసన్ దే కీలకపాత్ర. ముందు 15 పరుగులకు సన్ రైజర్స్ 3 వికెట్లు తీసి ఆ తర్వాత సూపర్ ఓవర్‌లో 3 బంతుల్లో 2 పరుగులిచ్చి 2 వికెట్లు తీసి కోల్ కతాకు గెలుపు అందించాడు. ఈ సీజన్లో తాను ఆడిన తొలి మ్యాచ్ లోనే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అందుకున్నాడు.