Begin typing your search above and press return to search.

నాని మూవీ సీన్ షేర్ చేసి ఇదే నా ఫీలింగ్‌ అంటూ స్టార్‌ క్రికెటర్‌ పోస్ట్‌

By:  Tupaki Desk   |   27 Dec 2021 11:30 PM GMT
నాని మూవీ సీన్ షేర్ చేసి ఇదే నా ఫీలింగ్‌ అంటూ స్టార్‌ క్రికెటర్‌ పోస్ట్‌
X
హీరో నాని నటించిన జెర్సీ సినిమా ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జాతీయ అవార్డును దక్కించుకున్న జెర్సీ సినిమా లోని రైల్వే స్టేషన్ సన్నివేశం గురించి ఎంత చెప్పినా తక్కువే. దర్శకుడు ఆ సన్నివేశంను మల్చిన తీరు.. నాని నటించిన తీరు ప్రతి ఒక్కరికి కూడా ఒకింత పులకరింతను కలిగిస్తుంది అనడంలో సందేహం లేదు. మనిషికి ఆనందం వచ్చిన సమయంలో... ఎమోషన్‌ వచ్చిన సమయంలో దాన్ని బయటకు తెలియజేసేందుకు సంశయిస్తూ ఉంటారు. కాని కొందరు మాత్రం దాన్ని బయట పెట్టేస్తూనే ఉంటారు. అలా నాని కూడా తన ఎమోషన్ ను రైల్వే స్టేషన్ లో ఎవరు చూడకుండా రైలు సౌండ్‌ లో కలిసి పోయేలా గట్టిగా మొత్తుకుని చూపిస్తాడు. ఇప్పుడు అదే తరహా ఎమోషన్ లో తాను ఉన్నట్లుగా టీం ఇండియా క్రికెటర్ శ్రీశాంత్‌.

మ్యాచ్ ఫిక్సింగ్‌ లో బహిష్కరణ కు గురి అయిన శ్రీశాంత్‌ చాలా కాలం తర్వాత రంజీల్లో అవకాశం దక్కించుకున్నాడు. రంజీల్లో మంచి ప్రదర్శణ కనబర్చితే మళ్లీ అతడు టీమ్ ఇండియాకు ఆడే అవకాశాలు కూడా లేక పోలేదు. అందుకే శ్రీశాంత్ కు ఇది జీవితంలో పెద్ద విషయం. క్రికెట్‌ కెరీర్‌ నాశనం అయ్యింది.. మళ్లీ బాల్‌ పట్టే అవకాశం లేదు అనుకున్న సమయంలో రంజీల్లో ఆడే అవకాశం వచ్చింది. దాంతో అతడి ఆనందంకు అవధులు లేవు. అదే విషయాన్ని తెలియజేస్తూ నాని జెర్సీ సినిమా లోని రైల్వే స్టేషన్‌ సన్నివేశాన్ని షేర్‌ చేయడం జరిగింది. ఇది ఖచ్చితంగా నాని సినిమాకు కూడా గర్వ కారణం అనడంలో సందేహం లేదు.

నాని హీరోగా గౌతమ్‌ తిన్ననూరి ఆ సినిమాను చేయడం జరిగింది. తెలుగు లో బ్లాక్ బస్టర్‌ విజయాన్ని సొంతం చేసుకోలేక పోయినా విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. అలాగే అవార్డులను దక్కించుకుంది. అందుకే హిందీలో సినిమాను చేసే అవకాశంను దక్కించుకున్నాడు. నాని హీరోగా ఆ సినిమాలో కెరీర్‌ బెస్ట్‌ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చాడు అనడంలో సందేహం లేదు. షాహింద్‌ కపూర్‌ ప్రస్తుతం రీమేక్ లో నటిస్తున్నాడు. తాను అంతగా ఈ సినిమాకు న్యాయం చేస్తానో లేదో అన్నట్లుగా అతడు చేసిన వ్యాఖ్యలు సినిమాలో నాని నటన తీరుకు అర్థం పడుతుంది. భారీ ఎత్తున అంచనాలున్న హిందీ జెర్సీ సినిమా ట్రైలర్ ఇప్పటికే ప్రేక్షకులను మెప్పించింది. సినిమా కమర్షియల్‌ గా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.