Begin typing your search above and press return to search.

బిగ్‌ బాస్‌:మళ్ళీ మహేష్ - శ్రీముఖికు గట్టిగా పడిందిగా..

By:  Tupaki Desk   |   13 Oct 2019 4:51 AM GMT
బిగ్‌ బాస్‌:మళ్ళీ మహేష్ - శ్రీముఖికు గట్టిగా పడిందిగా..
X
బిగ్ బాస్ ఎపిసోడ్ ప్రారంభం నుంచి మహేష్-శ్రీముఖిలకు పెద్దగా పడదు అన్న విషయం తెలిసిందే. ప్రత్యక్షంగా గానీ - పరోక్షంగానీ ఇద్దరి మధ్య చిన్నపాటి యుద్ధమే నడుస్తోంది. అయితే వారి మధ్య గొడవలు అంతగా ఎప్పుడు బయటపడలేదు. కానీ ఈ వారం ఎపిసోడ్ లో మాత్రం పూర్తిగా బయటకొచ్చాయి. కుండ బద్దలుగొట్టే టాస్క్‌ లో ఇద్దరు ఒకరి మీద ఒకరు పగ తీర్చుకున్నారు. ఈ క్రమంలోనే శనివారం ఎపిసోడ్ లో హోస్ట్ నాగార్జున ముందే వీరి గొడవ తారా స్థాయికి చేరుకుంది.

బిగ్ బాస్ ప్రైజ్ మనీ రూ.50 లక్షలు వస్తే ఏం చేస్తారు? ఎవరు ప్రైజ్ మనీకి అర్హులు కాదో చెప్పాలని నాగార్జున 8 మంది ఇంటి సభ్యులకు సూచించారు. దీంతో ఒక్కొక్కరు ఒక్కో రీజన్ చెప్పారు. ప్రైజ్ మనీతో కొందరు ఇల్లు కట్టుకుంటామని చెబితే - కొందరు వ్యాపారాలు గానీ - ఫిక్సిడ్ డిపాజిట్ గానీ చేస్తామని చెప్పారు. ఆ తర్వాత వితికా - వరుణ్ బాబా భాస్కర్ కు ప్రైజ్ మనీ గెలుచుకునే అర్హత లేదని చెప్పగా - రాహుల్ - బాబా భాస్కర్ ...వరుణ్ రిచ్ కాబట్టి అతనికి ప్రైజ్ మనీ అక్కరలేదని చెప్పారు.

అటు అలీ - శివజ్యోతిలు మహేష్ కు అర్హత లేదని చెప్పారు. మ‌హేష్ అస‌లు త‌న‌కు టైటిల్ గెలిచే అర్హ‌త లేద‌ని త‌న‌కు తానే చెప్పుకున్నాడ‌ని... అందుకే అత‌డికి ఈ రు.50 ల‌క్ష‌లు ద‌క్కే అర్హత లేద‌ని తేల్చేశారు. ఇక ఈ మధ్యలోనే మహేష్-శ్రీముఖికు ప్రైజ్ మనీ తీసుకునే అర్హతే లేదని స్ట్రాంగ్ గా చెప్పాడు. ప్రతిదీ గేమ్‌ లాగే ఆడుతుందని అందుకే ఆమెకు ఈ యాభై లక్షలు తీసుకునే అర్హత లేదన్నాడు. అయితే తనకు అర్హత లేదని మహేష్ చెప్పడంతో శ్రీముఖి హర్ట్ అయ్యింది. తాను కూడా మహేష్ గట్టిగా కౌంటర్ ఇస్తూ అతనికి యాభై లక్షల ఫ్రైజ్ మనీ తీసుకోవడానికి అర్హత లేదంది.

అసలు మేటర్ డబ్బులు గురించి కాదని - అతను పనికట్టుకుని తనని టార్గెట్ చేస్తున్నాడని చెప్పింది. తన క్యారెక్టర్‌ ని డిసైడ్ చేస్తున్నాడని.... అతను ఏ విషయమైనా తనకు అనుకూలంగా మలుచుకుని చెప్పుకుంటున్నాడని గట్టిగా ఇచ్చేసింది. ఈ విధంగా నాగార్జున ముందే ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడిచింది.