Begin typing your search above and press return to search.

ఆ సీమ ఎంపీకి అంత అస్వస్థత చేసిందా?

By:  Tupaki Desk   |   11 Oct 2015 5:05 AM GMT
ఆ సీమ ఎంపీకి అంత అస్వస్థత చేసిందా?
X
ప్రముఖ పారిశ్రామికవేత్త.. కర్నూలు జిల్లా నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి తీవ్ర అస్వస్థతతో ఉన్నారా? ఆయన ఆరోగ్య పరిస్థితి ఇబ్బందికరంగా ఉందా? అన్న ప్రశ్నలకు అవుననే చెబుతున్నారు. నంది పైపుల యజమానిగా.. విలక్షణమైన రాజకీయ నేతగా ఎస్పీవై రెడ్డికి పేరుంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున నంద్యాల ఎంపీ స్థానానికి పోటీ చేసిన ఆయన.. తర్వాత టీడీపీలోకి చేరేందుకు సన్నాహాలు చేశారు.

తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నా.. సాంకేతికంగా మాత్రం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నట్లుగా చెప్పే ఎస్పీవైరెడ్డి ఆరోగ్య పరిస్థితి ఏమాత్రం బాగోలేదని చెబుతున్నారు. నెల రోజుల క్రితం అత్యవసర చికిత్స కోసం ఆయన హైదారబాద్ లోని కేర్ లో చేరారు.

గుండెకు స్టంట్స్ అమర్చిన తర్వాత.. ఆయన కిడ్నీలకు సంబంధించిన సమస్యలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. దీంతో.. కిడ్నీ ఆపరేషన్ కూడా చేయాల్సి ఉంటుందన్న మాట వినిపిస్తోంది. ప్రస్తుతానికి ఎస్పీవై రెడ్డి ఆరోగ్యం నిలకడగా ఉన్నప్పటికీ.. కొద్దిరోజులు పూర్తి విశ్రాంతి అవసరమని చెబుతున్నారు. అంతేకాదు.. ఆయన చాలా నీరసంగా ఉన్నట్లు తెలుస్తోంది.

రెండు మూడు రోజుల్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత.. ఆరోగ్యపరమైన చికిత్సల కోసం అమెరికాకు తరలించాలన్న ఆలోచనలో ఆయన కుటుంబ సభ్యలు ఉన్నట్లు చెబుతున్నారు. విలక్షణ నేతగా సుపరిచితులైన ఎస్పీవై రెడ్డి వీలైనంత త్వరగా కోలుకొని చురుకుగా రాజకీయాల్లో పాలు పంచుకోవాలని ఆశిద్దాం.