Begin typing your search above and press return to search.

యువతి అద్దెకు దిగిన ఫ్లాట్‌ లో స్పై కెమెరా

By:  Tupaki Desk   |   3 May 2023 7:45 PM GMT
యువతి అద్దెకు దిగిన ఫ్లాట్‌ లో స్పై కెమెరా
X
పెరిగిన టెక్నాలజీని ఉపయోగించి ఎంతో మంది కొత్త తరహా నేరాలకు పాల్పడుతున్నారు. అమ్మాయిలపై అఘాయిత్యాలకు సరికొత్త విధానాలను కామాంధులు ఫాలో అవుతున్నారు. ఇటీవల రాజస్థాన్ లోని ఉదయ్‌ పూర్ లో షాకింగ్ సంఘటన జరిగింది. ఆ సంఘటన తో అమ్మాయిలు ఒంటరిగా అద్దెకు ఉండాలి అంటూ భయపడే పరిస్థితి నెలకొంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్‌ లోని ఒక చిన్న గ్రామానికి చెందిన యువతి ఉదయ్ పూర్ లో సాఫ్ట్‌ వేర్ ఉద్యోగం రావడంతో ఒక అపార్ట్‌మెంట్‌ లో ఫ్లాట్‌ ను అద్దెకు తీసుకుంది. ఇటీవలే ఆ ఫ్లాట్‌ లో చేరింది. ఫ్లాట్‌ లో చేరిన కొన్ని రోజులకే సీలింగ్ రిపేర్ ఉందని.. మెకానిక్ వస్తున్నాడని చెప్పి యువతి నుండి ఓనర్ తాళాలు తీసుకున్నాడు.

సీలింగ్ వర్క్ చేయించినట్లుగా ఓనర్‌ అదే రోజు ఆమెకు తాళం ఇచ్చేశాడు. మూడు రోజుల తర్వాత బెడ్ రూమ్‌ మరియు ఇతర రూమ్స్ లో స్పై కెమెరాలు ఉన్నట్లుగా గుర్తించింది. సీలింగ్ రిపేర్‌ పేరు చెప్పి ఓనర్‌ స్పై కేమెరా పెట్టించాడు అంటూ యువతికి అర్థం అయ్యింది.

విషయం తెలిసిన వెంటనే యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన ఉదయ్ పూర్ పోలీసులు ఎంక్వైరీ మొదలు పెట్టారు. ఫ్లాట్‌ ఓనర్ మరియు మెకానిక్ ను అదుపులోకి తీసుకున్నట్లుగా పేర్కొన్నారు. స్పై కెమెరాలు ఫిక్స్ చేసి మొబైల్‌ కు ఫిక్స్ చేయడానికి కారణం ఏంటి.. ఎన్నాళ్లుగా ఇలాంటి పనులు చేస్తున్నారు అంటూ పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నిస్తున్నారు.